తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌పై వెబ్‌సిరీస్‌! - టైటిల్‌ ఇదే - LAWRENCE BISHNOI WEB SERIES

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌పై వెబ్​ సిరీస్ ప్రకటించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జానీ ఫైర్‌ ఫాక్స్‌ ఫిల్మ్స్‌ ప్రొడక్షన్స్‌!

Gangster Lawrence Bishnoi Web Series
Gangster Lawrence Bishnoi Web Series (source ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2024, 5:17 PM IST

Gangster Lawrence Bishnoi Web Series : గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ - ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. సల్మాన్ ఖాన్​కు బెదిరింపులు , మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసు ఇలా పలు విషయాల్లో సంచలనంగా మారిన ఈ 31 ఏళ్ల పంజాబీ గ్యాంగ్‌ స్టర్‌ జైల్లోనే ఉంటూ తన కార్యకలాపాలను, గ్యాంగ్​ను నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ వెబ్​సిరీస్​ తెరకెక్కించబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ జానీ ఫైర్‌ ఫాక్స్‌ ఫిల్మ్స్‌ ప్రొడక్షన్స్‌ ఈ ప్రకటన చేసింది.

లారెన్స్‌ ఏ గ్యాంగ్‌స్టర్‌ స్టోరీ అనే టైటిల్‌తో దీన్ని రూపొందించనున్నారు. రీసెంజ్​గా హత్యకు గురైన బాబా సిద్ధిఖీ గురించి కూడా ఇందులో చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో బిష్ణోయ్​ విద్యార్థి నాయకుడి దశ నుంచి అతడు గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడు, ఎలా మారాడు? తన నేర సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు? వంటి వాస్తవ ఘటనలతో తెరకెక్కించనున్నారట.

ఈ టైటిల్‌ను ఇప్పటికే ఇండియన్‌ మోషన్‌ పిక్చర్స్‌ అసోసియేషన్‌ ఆమోదం కూడా తెలియజేసింది. ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను దీపావళి కానుకగా రిలీజ్​ చేయనున్నారు. ఆడియెన్స్​ను ఆకట్టుకునే విధంగా ఈ సిరీస్​ను తెరకెక్కించాలని తాను అనుకుంటున్నట్లు నిర్మాత అమిత్‌ జానీ పేర్కొన్నారు.

కాగా, జానీ ఫైర్‌ ఫాక్స్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌కు వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకుని ప్రాజెక్ట్​లను తెరకెక్కించడంలో మంచి పేరు ఉంది. ఇప్పటికే ఆ బ్యానర్‌లో వచ్చిన ఏ టైలర్‌ మర్డర్‌ స్టోరీ’ (ఉదయ్‌పుర్‌ టైలర్‌ కన్హయ్య లాల్ సాహు కథను ఆధారంగా), సీమా హైదర్‌, సచిన్‌ కథతో కరాచీ టు నోయిడా ప్రాజెక్ట్​లు ఆడియెన్స్​ను ఆకట్టున్నాయి.

సల్మాన్‌కు బెదిరింపులు - హీరో సల్మాన్‌ ఖాన్‌ 1998లో కృష్ణ జింకలను వేటాడటంపై కోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ జింకలను బిష్ణోయ్‌ వర్గం వారు పవిత్రంగా భావిస్తారు. అందుకే జింకలను వేటాడటం అదే వర్గానికి చెందిన లారెన్స్‌కు నచ్చలేదు. అందుకే అతడు 2018 నుంచి సల్మాన్‌ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని తన గ్యాంగ్​ చేత రెక్కీలు నిర్వహించి దాడికి పాల్పడ్డాడు. 2024 ఏప్రిల్‌లో సల్మాన్​ ఖాన్​ ఇంటిపై కాల్పులు జరిపించాడు. అంతకు మందు అతడి ఫామ్‌ హౌస్‌ వద్ద రెక్కీలు కూడా నిర్వహించారు. దాదాపు 25 మంది సల్మాన్‌పై దాడికి సిద్ధం చేసినట్లు నిఘా వర్గాలు అప్పుడు గుర్తించాయి.

వీకెండ్ స్పెషల్​ ఒక్క రోజే 25 సినిమా/సిరీస్​లు - ఆ 12 వెరీ స్పెషల్​

అలా జరగడం ఎంతో ఆనందంగా ఉంది : VD 12పై విజయ్ దేవరకొండ అప్డేట్

ABOUT THE AUTHOR

...view details