Viswak Sen Gaami OTT Release : టాలీవుడ్ కాంట్రవర్సీ హీరోగా పేరు సంపాదించుకున్న నటుడు విశ్వక్ సేన్. అభిమానులు ముద్దుగా మాస్ కా దాస్ అంటుంటారు. ఆయన చివరగా నటించిన చిత్రం గామి. ఎపిక్ అడ్వంచర్ థ్రిల్లర్గా ఇది రూపొందింది. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. చాందినీ చౌదరి, అభినయ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. మంచి వసూళ్లు కూడా వచ్చాయి.
విశ్వక్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ ఈ చిత్రానికి వచ్చాయి. అఘోరా పాత్రలో విశ్వక్ నటన సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ రిలీజ్కు కూడా రెడీ అయింది. జీ5 ఓటీటీ వేదికగా ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ ఇది అందుబాటులో ఉండనుండటం విశేషం. ఈవిషయాన్ని మూవీటీమ్తో పాటు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
కథేంటంటే ?(Gaami Story) : శంకర్ (విశ్వక్ సేన్) ఓ అఘోరా. అసలు తానెవరు? గతమేంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఇవేమి అతడికి కొంచెం కూడా గుర్తు ఉండవు. పైగా మానవ స్పర్శను కూడా తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితోనూ ఇబ్బంది పడుతుంటాడు. దీంతో తోటి అఘోరాలంతా అతనిని శాపగ్రస్థుడుగా భావిస్తారు. ఆశ్రమం నుంచి కూడా వెలివేస్తారు. ఈ క్రమంలో అతడు తనని తాను తెలుసుకునేందుకు ప్రయాణాన్ని మొదలుపెడతాడు. తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లో ఉంటుందని తెలుసుకుంటాడు. అక్కడి ద్రోణగిరి పర్వత శ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాల్లో ఆ సమస్యకు పరిష్కారం ఉంటుంది ఓ స్వామీజీ చెబుతారు. కానీ అక్కడికి చేరుకోవాలంటే ఎన్నో ప్రమాదాలను దాటాలి. కానీ వాటిని లెక్క చేయకుండా డాక్టర్ జాహ్నవి (చాందిని చౌదరి)తో కలిసి అక్కడికి అతడు వెళ్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? వెళ్లే దారిలో ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొన్నాడు? మాలిపత్రాలు సాధించాడా? అసలు తానెవరో చివరికి తెలుసుకుంటాడా? అనేది తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.
ఆ అగ్ర నిర్మాతతో నా పెళ్లి! - హీరోయిన్ అంజలి - Heroine anjali Marriage
ఆడియెన్స్ బీ అలర్ట్ గీతాంజలి మళ్లీ వచ్చేసింది - ఈ సారి ముగ్గురు దెయ్యాలతో - Geethanjali Malli Vachindi Trailer