Vishwaksen Mechanical Rocky Glimpse :'మాస్ కా దాస్'విష్వక్ సేన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ 'మెకానిక్ రాకీ' నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ గ్లింప్స్ ప్రస్తుతం సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.
ఇక ఈ వీడియోలో గ్యారేజ్ మెకానిక్‌గా విశ్వక్ చాలా నేచురల్‌గా కనిపించారు. కొత్త మేనరిజాన్ని చూపిస్తు తన పాత్రలో చక్కగా ఒదిగిపోయినట్లు కనిపించారు. అయితే ఇది పూర్తి యాక్షన్ బ్యాక్డ్రాప్తోనే కాకుండా అక్కడక్కడ లవ్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. యంగ్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌లు ఈ సినిమాలో నటనతో పాటు గ్లామర్‌తోనూ ఆకట్టుకోనున్నారు. చివరిలో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తన కామెడీ టైమింగ్‌తో అలరించారు. డ్రైవింగ్‌లో 'L' అంటే లేడీ డ్రైవర్ అంటూ అమాయకంగా చెప్పి నవ్వులు పూయిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది.
ఇక గ్లింప్స్ రిలీజ్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు మూవీటీమ్ వచ్చి సందడి చేసింది. ట్రైలర్ టెలికాస్ట్ చేసిన తర్వాత, చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. ఇక విష్వక్ కుడా ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.