Vishwaksen Laila: టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్ సేన్ లీడ్ రోల్లో తెరకెక్కిన సినిమా 'లైలా'. దర్శకుడు రామ్ నారాయణ్ ఈ సినిమా రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో విష్వక్ లేడీ గెటప్‌లో కనిపించనున్నారు. ఇటీవల రిలీజైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించి, సినిమా నుంచి ఓ సాంగ్ (ఇచ్చుకుందాం బేబీ) రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా విష్వక్ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. 'టీజర్లో మిమ్మల్ని లేడీ గెటప్ చూసి హీరో బాలకృష్ణ ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు?' అని మీడియా విష్వక్‌ను అడిగింది. దానికి విష్వక్ సింపుల్‌గా 'ఇంటికి జాగ్రత్తగా వెళ్లు. ఒక్కడివే తిరగొద్దు అన్నారు' (నవ్వుతూ) రిప్లై ఇచ్చారు. అలాగే లేడీ గెటప్ గురించి చాలానే మాట్లాడారు. ఈ గెటప్‌లో వాళ్ల నాన్న కూడా తనను గుర్తుపట్టలేకపోయారని విష్వక్ చెప్పారు.
'మూవీ కోసం లేడీ గెటప్ వేసుకున్న తర్వాత మా నాన్నకు వీడియో కాల్ చేశా. చాలా సేపు ఇద్దరం సైలెంట్‌గా కెమెరా వైపు చూస్తూ ఉండిపోయాం. నన్ను గుర్తుపడతారేమోనని వెయిట్ చేశాను. ఆయన ఏమీ మాట్లాడకపోయే సరికి 'డాడీ నేను' అన్నాను. ఆయన ఒక్కసారి కంగారు పడిపోయారు. నా ఫోన్ నుంచి ఎవరో అమ్మాయి కాల్ చేసి, నాకు ఇస్తుందేమోనని ఆయన ఎదురు చూశారట. ఈ గెటప్‌లో నా కన్న తండ్రే నన్ను గుర్తుపట్టలేదు. ఈ మూవీ మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది' విష్వక్ పేర్కొన్నారు.