తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మెకానిక్ రాకీ' ట్రైలర్ రిలీజ్- లవర్​బాయ్​గా విశ్వక్ సేన్ - MECHANIC ROCKY TRAILER

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కిన 'మెకానిక్‌ రాకీ' సినిమా ట్రైలర్ రిలీజైంది.

Mechanic Rocky
Mechanic Rocky (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2024, 5:31 PM IST

Mechanic Rocky Trailer :టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'మెకానిక్‌ రాకీ'. డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, లవ్‌, యాక్షన్‌ జానర్​లో ఈ సినిమా తెరకెక్కించారు. నవంబరు 22న సినిమా వరల్డ్​వైడ్ గ్రాండ్​గా రీలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఆదివారం ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి మీరు ఈ లేటెస్ట్ ట్రైలర్ చూశారా?

'కంప్యూటర్ స్సైన్స్​ చదివి, సివిల్ ఇంజినీర్ అయిపోతా' అని హీరో తన తండ్రికి చెప్పే డైలాగ్​తో ట్రైలర్ ప్రారంభమైంది. హీరో తన తండ్రి మెకానిక్ గ్యారేజ్​లోనే ఉంటూ డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడికి హీరోయిన్లు శ్రద్ధా, మీనాక్షీ పరిచయం అవుతారు. ఈ లవ్ ట్రాక్​ను రొమాంటిక్, ఫన్నీగా తీర్చిదిద్దినట్లున్నారు. ఇంతలో విలన్ ఎంట్రీ చూపించారు. వారితో హీరో ఫైట్, యాక్షన్ సీన్స్​ ఆకట్టుకున్నాయి. ఓవరాల్​గా ఈ సినిమా ఫన్, యాక్షన్ ఎంటర్టైనర్​గా ఉండనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

కాగా, మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్​లో ఆదివారం నిర్వహించారు. ఈ ఈవెంట్​లోనే ట్రైలర్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో విశ్వక్ సేన్​, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్​తోపాటు డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. సినిమాపై ఈవెంట్​లో హీరో విశ్వక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు సినిమాకు కావాలనే బజ్ ఇవ్వలేదని అన్నారు.

'సినిమాకు బజ్ రావట్లేదని చాలా మంది అన్నారు. బజ్ రావడం కాదు. నేనే ఇవ్వలేదు. ఈరోజు ఇద్దామని డిసైడయ్యా. మనందరం కలిసి ఇప్పుుడు సినిమాకు బజ్ ఇవ్వాలి. సినిమా ఆల్రెడీ చూశాను. దీనిపై నేను చాలా కాన్ఫిడెంట్​గా ఉన్నా. సినిమా రిలీజ్ కంటే ముందు రోజు 21కి నేనే రివ్యూలు వేస్తాను. సినిమా చూసిన ఆడియెన్స్ బాగా లేదంటే, థియేటర్​కు రాకండి. చాలా కాన్ఫిడెంట్​గా చెబుతున్నా. సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్. క్లైమాక్స్​ చూసి, మళ్లీ మళ్లీ థియేటర్​కు వస్తారు. అందరి సపోర్ట్​కు చాలా థాంక్స్​' అని విశ్వక్ అన్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటుడు సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

హీరో విష్వక్ సేన్ సంచలన నిర్ణయం- ప్రశంసలే ప్రశంసలు!

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' ట్విట్టర్ రివ్యూ- విశ్వక్ మాస్ షో ఎలా ఉందంటే? - Gangs Of Godavari

ABOUT THE AUTHOR

...view details