Vishwak Sen Laila Teaser: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'లైలా'. దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్నారు. సాహు గారపాటి నిర్మిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ శుక్రవారం టీజర్ రిలీజ్ చేశారు.
విశ్వక్ సేన్ 'లైలా' టీజర్ ఔట్- లేడీ గెటప్‌లో మాస్ కా దాస్ - LAILA TEASER
విశ్వక్ సేన్ కొత్త సినిమా టీజర్- మీరు చూశారా?

Published : Jan 17, 2025, 5:42 PM IST
టీజర్లో 'మనకు తెల్లగా చేసుడే కాదు. తోలు తీసుడు కూడా వచ్చు' అంటూ ఉన్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా కోసం విశ్వక్ తొలిసారి లేడీ గెటప్ వేశారు. దీనికి సంబంధించిన సీన్ కూడా టీజర్ చివర్లో చూపించారు. ఇది మూవీ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. మరి మీరు ఈ టీజర్ చూశారా?
కాగా, ఈ సినిమాలో విశ్వక్‌కు జంటగా ఆకాంక్ష శర్మ నటిస్తోంది. వెన్నెల కిషోర్, రవి మారియా, హర్ష వర్థన్, బ్రహ్మాజీ, రఘు బాబు తదితరులు ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. తనిష్క్ బాగ్చి, జిబ్రన్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గరపాటి ఈ సినిమా నిర్మించారు.