Vishwak Sen Gaami Movie :ఇప్పుటి వరకు మాస్, సాప్ట్ రోల్స్‌లో కనిపించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ప్రయోగాత్మక సినిమాల వైపు అడుగులేస్తున్నారు. మంచి కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇటీవలే 'గామి' అనే సినిమాలో ఆయన లీడ్ రోల్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో విశ్వక్ ఓ అఘోరాగా కనిపించనున్నారు.
తాజాగా విడుదలైన పోస్టర్, టీజర్లో ఆయన ఢిపరెంట్ లుక్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దీంతో ఈ సినిమాపై అందరిలో మరింత ఆసక్తి పెరిగింది. మార్చి 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో డైరెక్టర్ విద్యాధర్ కాగితతో పాటు హీరో విశ్వక్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
"గామి కోసం మా మూవీ టీమ్ దాదాపు నాలుగున్నరేళ్లు పని చేసింది. ఇంత టైమ్ పట్టింది కాబట్టే మంచి గ్రాఫిక్స్‌ను యాడ్ చేయగలిగాం. మానవ స్పర్శ లేని జీవితాన్ని మనం అస్సలు ఊహించలేం. అలాంటి సమస్య ఎదుర్కొంటున్న అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణమే ఈ సినిమా స్టోరీ. మేము వారణాసిలో కుంభమేళా షూటింగ్ చేశాం. మైనస్ 40 డిగ్రీల్లో కూడా గ్లౌజులు లేకుండానే విశ్వక్ నటించారు" అంటూ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. మరోవైపు హీరో విశ్వక్ కూడా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు.