Virat Kohli Biopic Heros :టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. కోహ్లీ ఆటతీరు, ప్రతిభ, వెనుతిరగని స్వభావం ఎంతో ఆదర్శప్రాయంగా ఉంటాయి. అందుకే ఈ ఆటగాడు కోట్ల మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. దిల్లీలోని ఓ సాధారణ యువకుడైన కోహ్లీ ఇప్పుడు ప్రపంచంలోని ఫేమస్ క్రికెటర్లలో ఒకటిగా నిలవడం అంత సులువుగా జరగలేదు. ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు ఎదుర్కొన్నాకే ఈ స్థాయిలోకి ఆయన రాగలిగారు. ఈ కారణంగానే కోహ్లీ జీవితకథను స్క్రీన్ మీదకు తీసుకురావాలనే అంశం తెరపైకి వచ్చింది. దీంతో కోహ్లీ బయోపిక్ లో అతని పాత్రలో నటించడానికి ఎవరు సరిపోతారనే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ హీరోల్లో కోహ్లీ పాత్రకు న్యాయం చేయగలిగే నటులు ఎవరున్నారో ఓ సారి చూద్దాం రండి.
రణ్వీర్ సింగ్ :
కోహ్లీ బయోపిక్ అనగానే చాలా మందికి మొదట గుర్తొచ్చిన పేరు రణవీర్ సింగ్. హిందీ సినీ పరిశ్రమలో ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే గుణం, టాలెంట్, కమిట్మెంట్కు ఈయన పెట్టింది పేరు. బాజీరావ్ మస్తానీ చిత్రంలో బాజీరావ్ పాత్ర, 83లో కపిల్ దేవ్ పాత్రలు ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అందుకే కోహ్లీ దూకుడు, ప్రతిభను ప్రదర్శించడానికి, రణవీర్ సరైన ఛాయిస్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
హృతిక్ రోషన్ :
చెక్కిన శిల్పం లాంటి ఆకృతి, సూపర్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిగిన మరో నటుడు హృతిక్ రోషన్. ఫిట్నెస్, నిబద్ధతతో పాటు క్లిష్టమైన పాత్రల్లో కూడా అవలీలగా నటించడం ఈయన ప్రత్యేకత. వార్, సూపర్ 30 వంటి సినిమాల్లో ఈయన నటన అద్భుతం. దీంతో కోహ్లీ పాత్రకు ఈయన సరిపోతారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
షాహిద్ కపూర్ :
ట్రాన్స్ఫర్మేటివ్ యాక్టింగ్ స్కిల్క్తో పాటు గతంలో స్పోర్ట్స్ సెంట్రిక్ పాత్రల్లో నటించి మెప్పించిన వ్యక్తి షాహిద్ కపూర్. కబీర్ సింగ్, పద్మావత్ సినిమాల్లోని నటనా సామర్థ్యం, శారీరక చురుకుదనంతో పాటు క్రాఫ్ట్ పట్ల షాహిద్ కున్న అంకితభావం కూడా క్రికెటర్ కోహ్లీ పాత్రకు ఇతను సరిపోతాడనే భావన తెస్తున్నాయి.