Vinesh Phogat Paris Olympics 2024 :ఒలింపిక్స్‌లో పతకం సాధించి భారత్‌కు ఖ్యాతి తెద్దామనుకున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు నిరాశ తప్పలేదు. అధిక బరువు ఉందంటూ తనపై ఒలింపిక్స్ సంఘం అనర్హత వేటు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఫైనల్ పోరులో పసిడి పతకం సాధిస్తుందన్న ఆశతో ఎదురుచూసిన భారతీయులను ఈ వార్త షాక్‌కు గురి చేసింది. ఈ నేపథ్యంలోనే వినేశ్‌కు ధైర్యం చెప్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆమెకు సపోర్ట్‌గా ఉంటామంటూ కామెంట్లు పెడుతున్నారు. క్రీడాభిమానులు కూడా వినేశ్‌కు మద్దతు తెలుపుతున్నారు.
"కొన్ని సార్లు, ఎంతగానో పోరాడే వ్యక్తులు పలు కఠినమైన అడ్డంకులను ఎదుర్కొంటారు. మీరు అస్సలు ఒంటరి కాదని గుర్తుంచుకోండి. కష్టాల మధ్య కూడా నిలదొక్కుకునే మీ అద్భుతమైన ధైర్యం నిజంగా ప్రశంసనీయం. మీ కష్టసుఖాల్లో మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం" - సమంత
"నువ్వు ఎప్పటికీ విజేతవే" - విక్కీ కౌశల్
"100 గ్రాముల బరువు అధికంగా ఉండటంతో వినేశ్‌పై అనర్హత వేటు పడిందని తెలిసి నేను ఎంతో షాకయ్యాను. దీన్ని బట్టి మనం కూడా వెయిట్ విషయంలో ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండాలి. ఆమె వెంటనే బరువు తగ్గాలని నేను కోరుకుంటాను. కానీ, ఆ అవకాశం మళ్లీ తిరిగి రాదు కదా" - హేమామాలిని
"వినేశ్ పొగాట్. మీరు మా మనసులు గెలుచుకున్నారు. మీరు ఏదైతే సాధించారో, నిలబడిన తీరు రానున్న తరాలకు స్ఫూర్తినిస్తుంది" - ప్రకాశ్ రాజ్