Vijay Devarkonda Relationship : రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ తన స్టైల్ ఆటిట్యూడ్‌తో ఇండియా వైడ్‌గా ఫుల్ ఫ్యాన్ ఫాలియింగ్ పెంచుకున్నారు. అయితే ఈయన హీరోయిన్ రష్మికతో రిలేషన్షిప్ మెయిన్‌టెయిన్ చేస్తున్నట్లు చాలా రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. గీతా గోవిందం సినిమా అప్పటి నుంచి రష్మీక మంధానకు విజయ్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పటికీ అప్పుడప్పుడు ఇద్దరూ సినిమాలకు ఒకేసారి బ్రేక్ ఇవ్వడం, ఒకే టూరిస్ట్ స్పాట్లో విడివిడిగా ఫొటోలు పెడుతుండటం చూసి చాలా మంది రష్మికకు, విజయ్‌కు మధ్య కచ్చితంగా రిలేషన్ నడుస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అలానే హీరోయిన్ సమంతతో కూడా చేసినట్లు ఖుషి సినిమా సమయంలో ప్రచారం సాగింది.
ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా దీనిపై స్పందించారు. వాటికి చెక్ పెట్టారు రౌడీ హీరో. తాను నిజంగానే రిలేషన్ షిప్‌లో ఉన్నానని చెప్పేశారు. మీరు రిలేషన్‌లో ఉన్నారా? అన్న ప్రశ్నకు బదులిచ్చారు. "అవును ఉన్నాను. నా తల్లిదండ్రులు, సోదరుడు, స్నేహితులతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను" అంటూ సమాధానం ఇచ్చారు. తన పేరుకు ముందు ఉన్న 'ది' అనే ట్యాగ్‌పై మాట్లాడుతూ అది తానే పెట్టుకున్నట్లు చెప్పారు.
కాగా, చాలామంది విజయ్ను బాలీవుడ్ రొమాంటిక్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీతో పోలుస్తుంటారు. సినిమాల్లో విజయ్ రొమాన్సింగ్ అలా ఉంటుంది మరి. రౌడీ అని ముద్దుగా పిలుచుకునే ఈ హీరో తనతో పాటు నటించిన ఏ హీరోయిన్‌తో నైనా అంతే క్లోజ్‌గా, బోల్డ్‌గా మూవ్ అవుతుంటారు. అది చూసిన కెమెరా కళ్లు వీళ్లిద్దరి మధ్యలో ఏదో ఉందనుకుని ఊహాగానాలు అల్లుతున్నాయి.
ఇకపోతే విజయ్ దేవరకొండ- పరశురామ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా 'ఫ్యామిలీ స్టార్'. ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉండనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. 2గంటల 40 నిమిషాల పాటు సినిమా స్టోరీ నడుస్తుందట. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాలు ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకున్నాయి.