Family Star Day 1 Collections :విజయ్ దేవరకొండ, మృనాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ద ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5 శుక్రవారం రిలీజ్ అయి ప్రేక్షకులు, అభిమానుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టింది. గీతాగోవిందం లాంటి సినిమా తర్వాత పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ చిత్రం భారీ అంచనాలను చేరుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మిక్స్డ్ రివ్యూస్ కనిపిస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ కుటుంబ కథా చిత్రం థియేటర్లో కాస్త నిరాశనే మిగిల్చిందని తెలుస్తోంది.
ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు ఇండియా వైడ్గా రూ.5.75 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తొలి రోజు థియేటర్ ఆక్యుపెన్సీ కేవలం 38.45 శాతం మాత్రమే అని తెలుస్తోంది. మార్నింగ్ షో 37.21 శాతం, మధ్యాహ్నం షో 40.85శాతం, ఈవెనింగ్ షో 34.81శాతం, నైట్ షోకు 40.92శాతం మాత్రమే థియేటర్లు నిండాయట. యూఎస్లే మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. 475కే డాలర్లుకుపైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. కాగా, విజయ్ గత సినిమాల కలెక్షన్లతో పోలిస్తే ఫ్యామిలీ స్టార్ ఓపెనింగ్సే తక్కువ. ఖుషి రూ.15.25కోట్లు, లైగర్ రూ.15.95కోట్లు, డియర్ కామ్రేడ్ రూ.11.90కోట్లు, వరల్డ్ ఫేమస్ లవర్ రూ. 7 కోట్లు వచ్చాయట. అయితే ఒక వారం ముందు విడుదలైన డీజే టిల్లూ స్క్వేర్ 8 రోజుల్లో రూ. 96కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
విజయ్ 'ఫ్యామిలీ స్టార్' ఫస్ట్ డే కలెక్షన్స్ - ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే? - Family star Day 1 collections - FAMILY STAR DAY 1 COLLECTIONS
Family Star Day 1 Collections : ద ఫ్యామిలీ స్టార్ - ఏప్రిల్ 5 శుక్రవారం రిలీజ్ అయి ప్రేక్షకులు, అభిమానుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టింది. గీతాగోవిందం లాంటి సినిమా తర్వాత పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఈ చిత్రం తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?
విజయ్ ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే కలెక్షన్స్ - ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే?
Published : Apr 6, 2024, 11:02 AM IST