Sankranti Ki Vastunnam Promotions: ప్రతి సంవత్సరం లానే ఈ సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమా సందడి ఉండనుంది. ఈసారి సంక్రాంతి బరిలో చిన్న సినిమాలు పోటీ పడటం లేదు. మూడు పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలయ్య 'ఢాకు మహారాజ్'తో పాటు విక్టరీ వెంకటేశ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' విడుదల కానున్నాయి. అయితే ఈ మూడు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం'లో వెంకటేశ్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. అటు భార్య, ఇటు ప్రేయసి మధ్యలో నలిగిపోయే ఓ పోలీసు పాత్రలో వెంకటేశ్ అలరించనున్నారు.
ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూలు, ఫన్నీ చిట్చాట్లు, చార్ట్‌బస్టర్ సాంగ్స్, కళ్లు చెదిరే ప్రోమోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వెరైటీగా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల దృష్టి తమవైపు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. ఇటీవల జరిగిన మూవీటీమ్ ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో ట్రెండింగ్ నెం 1లో దూసుకుపోతోంది. ఐశ్వర్య రాజేష్‌తో చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ నంబర్ 6 స్థానం సంపాదించింది.