తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సాయి పల్లవితో మళ్లీ నటించకపోవడానికి కారణం అదే: వరుణ్ తేజ్ - Varun Tej Vallantine movie

Varun Tej Sai Pallavi: టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్‌ తేజ్‌- సాయి పల్లవి కాంబోలో ఫిదా తర్వాత మరో సినిమా రాకపోవడంపై హీరో స్పందించారు. మరి ఆయన ఏమన్నారంటే

Varun Tej Sai Pallavi
Varun Tej Sai Pallavi

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 10:22 PM IST

Updated : Feb 26, 2024, 10:51 PM IST

Varun Tej Sai Pallavi:మెగాహీరో వరుణ్‌ తేజ్‌ ఆపరేషన్‌ వాలెంటైన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 1న గ్రాండ్​గా థియేటర్లలో రిలీజ్​ కానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ ప్రమోషన్స్​లో బిజిగా ఉంది. అయితే రీసెంట్​గా ఓ ఇంటర్వ్లూలో పాల్గొన్న వరుణ్​కు ఇంట్రెస్టింగ్​ ప్రశ్న ఎదురైంది. 'ఫిదా'తో తర్వాత సాయి పల్లవితో మళ్లీ నటించకపోవడంపై కారణం ఏంటని అడిగారు. దీనికి స్పందించిన వరుణ్ ఏమన్నారంటే?

'మా కాంబోలో ఇంకో మూవీ రూపొందించేందుకి ప్లాన్స్​ జరిగాయి. అందుకోలం మేమిద్దం స్టోరీ కూడా విన్నాం. కానీ, ఈసారి చేస్తే 'ఫిదా'ను మించి ఉండాలనేదే మా ఉద్దేశం. లేకపోతే చేయకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయాం' అని వరుణ్ అన్నారు. ఇక ఇదే ఇంటర్వూలో తనకు ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్​ గురించి కూడా చెప్పారు. 'ఇండస్ట్రీలో నితిన్‌ నాకు మంచి ఫ్రెండ్. తను సినిమా హిట్‌ అయినా ప్లాప్​ అయినా ఒకేలా కష్టపడతాడు. ప్రతి సినిమా రిజల్ట్​ను విశ్లేషించుకుంటాడు. కుదిరితే నితిన్‌, సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి ఓ సినిమాలో నటించాలని ఉంది' అని వరుణ్ అన్నారు. కాగా, ఆపరేషన్‌ వాలెంటైన్​ విషయానికొస్తే ఈ సినిమా ఎయిర్‌ ఫోర్స్ బ్యాక్​డ్రాప్​తో తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది. ఇందులో వరుణ్​ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా నటించారు. మనూషీ చిల్లర్‌ హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటుడు నవదీప్‌ కీలక పాత్ర పోషించారు.

డబ్బు ఖర్చుపెడితేనే హుందాతనం రాదు: 'ఆపరేషన్ వాలంటైన్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్​ ఆదివారం హైదరాబాద్​లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్​కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సినిమా నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఖర్చుపెడితే సినిమాకు హుందాతనం రాదని, అది మన ఆలోచనల్లో ఉండాలంటూ సూచించారు. తక్కువ బడ్జెట్​తో సినిమాలను తెరకెక్కించి వాటిని ఎలా రిచ్​గా చూపిస్తే బాగుంటుందో డైరెక్టర్లు ఆలోచించాలని కోరారు. అప్పుడే నిర్మాతలు, సినీ పరిశ్రమ బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

'డబ్బు ఖర్చుపెడితేనే హుందాతనం రాదు' - డైరెక్టర్లకు చిరు సూచన

వరుణ్ తేజ్ - లావణ్య ప్రత్యేక పూజలు చేసింది అందుకోసమేనా?

Last Updated : Feb 26, 2024, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details