తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అన్​స్టాపబుల్'లో గెస్ట్​గా ఒలింపిక్ మెడలిస్ట్- అథ్లెట్​కు రూ.2 లక్షలు! - UNSTOPPABLE SEASON 4

అన్​స్టాబుల్ సీజన్​ 4 లో ఒలింపిక్ మెడలిస్ట్- అథ్లెట్​కు రూ.2 లక్షల రివార్డ్

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Sports Team

Published : Nov 3, 2024, 6:45 AM IST

Unstoppable Season 4 Guest :నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్​గా 'అన్​స్టాపబుల్ సీజన్​ 4' సక్సెస్​ఫుల్​గా రన్ అవుతోంది. ఈ టాక్ షోకు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాగా, తాజాగా 'లక్కీ భాస్కర్' మూవీ టీమ్ వచ్చింది. హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, ప్రొడ్యూసర్ నాగవంశీ హాజరై బాలయ్యతో హుషారుగా ఈ షో లో సందడి చేశారు.

అయితే బాలయ్య తన షో ద్వారా ప్రేక్షకులకు వినోదం పంచడమే కాకుండా స్ఫూర్తి నింపే ప్రయత్నమూ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్​లో అనుకోని గెస్ట్ వచ్చి ప్రేక్షుకుల్లో స్ఫూర్తి నింపారు. 'సినిమాలో అదృష్టం ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది. కానీ, నిజ జీవితంలో ఎలాంటి లక్ లేకుండా ఓ అమ్మాయి కృషి, పట్టుదలతో తన కలను గెలిచిన కథ' అంటూ బాలయ్య ఆ ఛాంపియన్​ AV (వీడియో)కి ఇంట్రడక్షన్​ ఇచ్చారు. తను ఎవరో కాదు. ఇటీవల పారిస్ పారాలింపిక్స్​లో బ్రాంజ్ మెడల్ సాధించిన పారా అథ్లెట్ దీప్తి జివాంజి.

ఇక దీప్తితోపాటు ఆమె కోచ్​ కూడా అన్​స్టాపబుల్ షో కి విచ్చేశారు. దీప్తి సాధించిన బ్రాంజ్ మెడల్​ను బాలయ్య ఆమె మెడలో వేశారు. ఆమెతో సరదాగా మాట్లాడారు. ఈసారి గోల్డ్ మెడల్ సాధించాలంటూ ఆమెకు విషెస్ తెలిపారు. అలాగే ఆమెకు అన్​స్టాపబుల్ స్పాన్సర్ల తరపున రూ. 1,50,000 చెక్ అందించారు. దీప్తి పట్టుదలకు ముగ్ధులైన నిర్మాత నాగవంశీ కూడా వెంటనే ఆమెకు ఆర్థిక ప్రోత్సాహం ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్ తరఫున రూ.50 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు.

కాగా, పారిస్ వేదికగా సెప్టెంబర్​లో జరిగిన పారాలింపిక్స్​లో దీప్తి కాంస్య పతకంతో సత్తా చాటింది. 400 మీటర్ల టీ- 20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్​ ముద్దాడింది. ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ ఆహా వేదికగా అన్​స్టాపబుల్ టాక్ షో స్ట్రీమింగ్ అవుతోంది.

'అన్​స్టాపబుల్' సీజన్ 4 -​ ఫస్ట్ ఎపిసోడ్​లోనే పవర్​ఫుల్ గెస్ట్-ఎవరంటే?

'హోస్ట్​గా నాకు చాలా ఆఫర్లు వచ్చాయి- ఆయన కోసమే ఈ షో చేస్తున్నాను'

ABOUT THE AUTHOR

...view details