Trisha Rajamouli Movie :దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా త్రిష కొనసాగుతున్నారు. ఆమె పలువురు కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలతో, దర్శక నిర్మాతలతో కలిసి పని చేశారు. కానీ ఈ బ్యూటీ ఒకప్పుడు దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ సినిమాలో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసిందన్న విషయం మీకు తెలుసా? మీరు విన్నది నిజమే. జక్కన్న లాంటి స్టార్ డైరెక్టర్ అవకాశం ఇస్తే ఈ అమ్మడు నో చెప్పేసిందట. అసలు ఆ సినిమా ఏది? త్రిష ఎందుకు ఆ సినిమాలో నటించలేదు? తదితర విషయాలు తెలుసుకుందాం.
ఆ స్టార్ సరసన హీరోయిన్‌గా!
వరుస హిట్లతో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న రాజమౌళి 2009లో 'మగధీర' చిత్రం తర్వాత 'మర్యాద రామన్న' తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా నటించారు. అయితే ఇందులో ఫీమేల్ లీడ్‌గా నటించే ఛాన్స్‌ను మొదట త్రిషకే ఇచ్చారట. అప్పటికే త్రిష స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న నేపథ్యంలో ఆమెను ఎంపిక చేసుకున్నారట రాజమౌళి. అయితే సునీల్ వంటి కమెడియన్ పక్కన హీరోయిన్‌గా నటించడం వల్ల కెరీర్‌పై ఎఫెక్ట్ పడుతుందని భావించిన త్రిష జక్కన్న ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో తన స్థానంలో హీరోయిన్‌గా సలోనిని తీసుకున్నారని సమాచారం.
రాజమౌళి మార్క్ స్టోరీతో, మంచి కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అటు సలోనితో పాటు సునీల్ యాక్షన్‌కు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా ఈ సినిమా వారిద్దరి కెరీర్‌కు మంచి ప్లస్ పాయింట్ అయ్యింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాజమౌళి డైరెక్ట్ చేసిన ఏ సినిమాలోనూ త్రిష ఇప్పటివరకు కనిపించలేదు. ఇటు జక్కన్న పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే, మరోపక్క వరుస సినిమాలతో త్రిష స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సంపాదించుకుంది.