తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ప్రతినిధి-2' రిలీజ్ డేట్ ఫిక్స్- థియేటర్లలోకి వచ్చేది అప్పుడే - Prathinidhi 2 Release - PRATHINIDHI 2 RELEASE

Prathinidhi 2 Release Date: టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ లేటెస్ట్ మూవీ ప్రతినిధి-2 రిలీజ్ డేట్ కన్ఫార్మ్ అయ్యింది. ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుందంటే?

Prathinidhi 2 Release Date
Prathinidhi 2 Release Date (Source: ETV BHARAT)

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 8:30 PM IST

Updated : May 4, 2024, 9:32 PM IST

Prathinidhi 2 Release Date:టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన్న లేటెస్ట్ మూవీ 'ప్రతినిధి-2'. పదేళ్ల క్రితం వచ్చిన 'ప్రతినిధి' సినిమాకు ఇది సీక్వెల్​. ఈ సినిమాను ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు తెరకెక్కించారు. పొలిటికల్ బ్యాక్​డ్రాప్​గా రూపొందిన ఈ మూవీ కోసం మూవీలవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్​ చేశారు. ఈ సినిమా మే 10న వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానున్నట్లు తెలిపారు.

ఇక రీసెంట్​గా రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్​కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో హీరో రోహిత్ పవర్​ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. టీజర్​లో ఆయన డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. 'రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడుంది?', 'ఒళ్లు వంచి బయటకు వచ్చి ఓటు వేయండి, లేదంటే దేశం విడిచి వెళ్లిపోండి. అదీ కూదరకపోతే చచ్చిపోండి' డైలాగ్స్​ టీజర్​లో హైలైట్​గా నిలిచాయి. దీంతో పూర్తిగా రాజకీయ అంశాలతో సినిమా ఇంట్రస్టింగ్​గా ఉండనుందని ఆడియెన్స్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారు. ఇక ఈ టీజర్​ మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా మార్చి 29న రిలీజైంది.

అయితే ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. కాగా, శనివారం కొత్త తేదీని అనౌన్స్ చేయడం వల్ల మూవీ లవర్స్​లో జోష్ వచ్చింది. ఇక వానరా ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్‌పై కుమారరాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన వీడియో గ్లింప్స్​కు మంచి స్పందన రాగా, ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది. ఇక చాలా కాలం పాటు బుల్లి, వెండి తెరకు దూరంగా ఉన్న ఉదయభాను ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. హీరో రోహిత్​కు జోడీగా నటి సిరి నటించింది. ప్రధాన పాత్రలలో జిషుషేన్ గుస్తా, శ‌ర‌ద్ ఖేల్క‌ర్‌, దినేష్ తేజ్వంటి వంటి నటులు కూడా కనిపించారు.

ప్రతినిధి 2 ట్రైలర్ రిలీజ్- ఎన్నికల హీట్‌ను పెంచేలా ఉందిగా! - Prathinidhi 2 Movie

ఇంట్రెస్టింట్​గా నారా రోహిత్​ 'ప్రతినిధి 2' కాన్సెప్ట్​ టీజర్​

Last Updated : May 4, 2024, 9:32 PM IST

ABOUT THE AUTHOR

...view details