తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

టాలీవుడ్ మోస్ట్​ అవైటెడ్​ ప్రాజెక్ట్స్​ - ఏ మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే? - Tollywood Upcoming Movies - TOLLYWOOD UPCOMING MOVIES

Tollywood Upcoming Movies Shooting : ప్రస్తుతం టాలీవుడ్​ నుంచి రాబోయే మోస్ట్​ అవైటెడ్​ మూవీస్ చాలానే ఉన్నాయి. ఇంతకీ ఆ మూవీస్​ షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం.

source ETV Bharat
Tollywood Upcoming Movies Shooting (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 9:45 PM IST

Tollywood Upcoming Movies Shooting : ప్రస్తుతం మోస్ట్​ అవైటెడ్​ మూవీస్ చాలానే ఉన్నాయి. వాటిని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందు ఆయా సినిమాల హీరోలు, దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇంతకీ ఏ మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం.

  • కల్కి 2898 ఏడీ భారీ సక్సెస్​ అందుకోవడంతో విజయోత్సాహంలో ఉన్న ప్రభాస్ ప్రస్తుతం తన తర్వాతి సినిమాల షూటింగ్స్‌ను కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన నుంచి నెక్ట్స్​ రాబోతున్న చిత్రం రాజాసాబ్(Prabhas Rajasaab). మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంషాబాద్‌లో జరుగుతోంది.
  • ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర(Chiranjeevi Viswambara). వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటిస్తున్న పుష్ప 2(Alluarjun Pushpa 2) రామోజీ ఫిలిం సిటీలో జరుపుకుంటోందని సమాచారం. దర్శకుడు సుకుమార్ దీన్ని దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్​లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
  • జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న దేవర(NTR Devara Movie) షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోందట.
  • ఎలక్షన్స్ పూర్తయ్యాక మళ్లీ షూటింగ్​లోకి అడుగుపెట్టిన బాలయ్య ఎన్​బీకే 109ను(NBK 109 Movie) పూర్తి చేసే పనుల్లో ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోలో ఇది షూటింగ్ జరుపుకుంటోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
  • మిస్టర్ బచ్చన్ టీమ్​ ఈ మధ్యే కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్​కు తిరిగొచ్చింది. ప్రస్తుతం ఐడీపీఎల్ కాలనీలో షూటింగ్ జరుపుకుంటోంది.
  • ధనుశ్​, నాగార్జున, రష్మిక నటిస్తున్న కుబేర(Dhanush Kubera Movie) షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లోనే జరుగుతోందట. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.
  • నాని, వివేక్ ఆత్రేయ కాంబో సరిపోదా శనివారం షూటింగ్ సిటీ కాలేజ్‌లో జరుగుతోందని తెలిసింది.
  • సూపర్ స్టార్‌ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ(Rajinikanth Lokesh Kanagaraj Movie) మూవీ షూటింగ్​ హైదరాబాద్‌లోనే జరుగుతుందని తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details