Vishwak Sen Jr NTR remake Film:యంగ్ హీరో విశ్వక్ సేన్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌కు వీరాభిమానని పలు వేదికల్లో చెబుతుంటాడు. వీళ్లిద్దరి బాండింగ్‌కు ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతుంటారు. అయితే విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఈ సినిమా మే 31న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో విశ్వక్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ప్రమోషన్స్‌లో భాగంగా యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు విశ్వక్.
'ఎన్టీఆర్, మీరు మంచి ఫ్రెండ్ కదా. ఒకవేళ ఎన్టీఆర్ సినిమాల్లో రీమేక్ చేయాల్సి వస్తే, ఏది ఎంపిక చేసుకుంటారు?' అన్న సుమ ప్రశ్నకు విశ్వక్ 'నా అల్లుడు' అని ఠక్కున చెప్పేశాడు. అయితే స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి రీమేక్ గా చిత్రీకరిస్తే కచ్చితంగా హిట్ అవుతుందని విశ్వక్ అన్నాడు. వాస్తవానికి 'నా అల్లుడు' సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో శ్రియా శరణ్, జెనీలియా హీరోయిన్లు నటించారు. రమ్య కృష్ణ అత్త పాత్రలో మెప్పించారు.
విశ్వక్ సేన్ సినిమా 'దాస్ కా దమ్కీ' ప్రమోషనల్ ఈవెంట్‌కు వెళ్లిన తారక్ ఇది తన బాధ్యత అని, పాషన్‌తో పనిచేసే విశ్వక్ లాంటి వాళ్లను కచ్చితంగా ప్రోత్సాహించాలని చెప్పారు. ఎన్టీఆర్ యాక్టింగ్‌తో పాటు గెటప్ కూడా ఇమిటేట్ చేస్తూ సక్సెస్ కొట్టేస్తున్న విశ్వక్, తారక్ ఎప్పుడు కనిపించినా అభిమానం చూపిస్తూనే ఉంటాడు. 'ఒక ఫ్యాన్ కోసం ప్రమోషనల్ ఈవెంట్‌కు రావడమంటే చాలా గ్రేట్. నన్ను డిన్నర్‌కి కూడా రమ్మని పిలిచారు. నా కోసం దేవుడు పంపిన అన్నగా భావిస్తాను' అని విశ్వక్ సేన్ ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో మాట్లాడాడు.