తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దేవర టు విశ్వంభర - ఈ సినిమాల షూటింగ్స్​ ఎక్కడ జరుగుతున్నాయంటే? - Tollywood Star Hero Movies - TOLLYWOOD STAR HERO MOVIES

Tollywood Star Hero Movies Shootings : టాలీవుడ్ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలన్నీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. రాబోయే ఆరు ఏడు నెలల పాటు వరుసగా బాక్సాఫీస్ ముందు సందడి చేయనున్నాయి. ఇంతకీ ఏ స్టార్ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం.

Source ETV Bharat
Tollywood Star Hero Movies (Source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 3:40 PM IST

Tollywood Star Hero Movies Shootings :టాలీవుడ్ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలన్నీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. రాబోయే ఆరు ఏడు నెలల పాటు వరుసగా బాక్సాఫీస్ ముందు సందడి చేయనున్నాయి. ఇంతకీ ఏ స్టార్ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందో సమాచారం తెలుపుతూ బయట కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. వాటి ఆధారంగా ఏ సినిమాలు ఎక్కడ చిత్రీకరణలు జరుగుతున్నాయో తెలుసుకుందాం.

  • మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర షూటింగ్ గోవాలో జరుగుతోందట. ఇక్కడ కొంత టాకీ పార్ట్​తో పాటు ఓ సాంగ్ కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రానున్న ఈ సినిమా అక్టోబర్ 10న గ్రాండ్​గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న​ పుష్ప 2 ప్రగతి రిసార్ట్స్​లో జరుగుతోందని అంటున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఆగస్టు 15న రానుంది.
  • మెగా పవర్ స్టార్​ రామ్​చరణ్​ - శంకర్ కాంబినేషన్​లో వాయిదా పడుతూ వస్తున్నా గేమ్ ఛేంజర్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటోందట. దిల్​ రాజు నిర్మాత. ఈ మూవీ రిలీజ్​ డేట్​పై క్లారిటీ లేదు.
  • మెగాస్టార్ చిరంజీవి - బింబిసార ఫేమ్ వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతోన్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర అన్నపూర్ణ 7 ఏకేర్స్​లో జరుపుకుంటోందని తెలిసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది.
  • రౌడీ హీరో విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి లేటెస్ట్ మూషవీ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్​లో జరుగుతోందట.
  • నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోందని తెలిసింది. వివేక్ ఆత్రేయ దర్శకుడు.
  • దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ సినిమా షూటింగ్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో కొనసాగుతోందట. సార్​ మూవీ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు.
  • శర్వానంద్​ - అభిలాష్ కంకర కాంబో సినిమా షూటింగ్ శంషాబాద్​లో జరుగుతుందని తెలిసింది.
  • మ్యాచో స్టార్ గోపీచంద్ - శ్రీను వైట్ల కాంబో మూవీ విశ్వం షూటింగ్ మేడ్చల్ పరిసర ప్రాంతాలలో చేస్తున్నారని తెలిసింది.
  • కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్​ - టాలీవుడ్ స్టార్ డైరెక్టర్​ శేఖర్ కమ్ముల కుబేర చిత్రం సారధి స్టూడియోలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
  • తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ కంగువ ప్రస్తుతం పఠాన్ చెరు పరిసర ప్రాంతాలలో చేస్తున్నారట.

ABOUT THE AUTHOR

...view details