Kannappa Teaser: టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి టీజర్ రిలీజైంది. హైదరాబాద్‌లో శుక్రవారం టీజర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై టీజర్ విడుదల చేశారు. ఇక వీడియో ఆఖర్లో పాన్ఇండియా స్టార్ ప్రభాస్ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
ఓం నమః శివాయ అంటూ ప్రారంభమై టీజర్ పూర్తిగా ఆసక్తిగా సాగింది. ఇందులో విష్ణు అతి బలవంతుడిగా కనిపించనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాతో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్, భారీ యాక్షన్ సీన్స్‌తో టీజర్ గ్రాండ్‌గా ఉంది. చివర్లో 1 సెకన్ ప్రభాస్ షాట్ టీజర్‌కు హైలైట్ అయ్యింది. మరి మీరు ఈ టీజర్ చూశారా?
ప్రభాస్ నా ఫ్యామిలీ: ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్లో హీరో విష్ణు మీడియాతో మాట్లాడారు. పలువురు అడిగిన ప్రశ్నలకు విష్ణు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ప్రభాస్‌తో ఉన్న రిలేషన్ గురించి అడిగారు. 'ప్రభాస్ నాకు బ్లడ్ రిలేషన్ కాకపోయినా, అతను నాకు ఓ సోదరుడితో సమానం' అని విష్ణు అన్నారు. ఇక రానున్న 2-3 నెలల్లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తామని హీరో చెప్పారు.