తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్​కు రెడీ - ఎప్పుడంటే? - Tollywood Boxoffice Rereleases - TOLLYWOOD BOXOFFICE RERELEASES

Tollywood Boxoffice Rereleases : టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు మరో రెండు స్టార్ హీరోల చిత్రాలు రీరిలీజ్​కు రెడీ అయ్యాయి. పూర్తి వివరాలు స్టోరీలో.

source Getty Images
Tollywood Boxoffice Rereleases (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 2:56 PM IST

Tollywood Boxoffice Rereleases : టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు రీరిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి సూపర్ హిట్ చిత్రాలను 4kలోకి అప్​గ్రేడ్ చేసి మళ్లీ థియేటర్లలోకి విడుదల చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సినిమాలు కూడా రీరిలీజ్​లో మంచి వసూళ్లనే అందుకుంటూ బాక్సాఫీస్​ ముందు సందడి చేస్తున్నాయి.

పోకిరి చిత్రంతో మొదలైన ఆ ట్రెండ్​ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇదే సమయంలో కొందరూ నిర్మాతలు కూడా అభిమానుల ఎమోషన్స్​ను క్యాష్ చేసుకోవడానికి వాటిని మళ్లీ విడుదల చేస్తున్నారు. ఏదేమైనా మళ్లీ ఇప్పుడు మరో రెండు స్టార్ హీరోల చిత్రాలు రీరిలీజ్​కు రెడీ అయ్యాయి. అవే శివ, మురారి.

Siva Movie Rerelease : శివ సినిమా విషయానికొస్తే అక్కినేని నాగార్జున కెరీర్​ను మలుపు తిప్పిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్. నాగార్జున కెరీర్​నే కాదు టాలీవుడ్​లో, భారతీయ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్​ను సృష్టించింది. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి చెప్పాలంటే శివ ముందు, శివ తర్వాత అని చెబుతుంటారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీన్ని తెరకెక్కించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా రీరిలీజ్ అవుతోంది. ఆగస్ట్ 29 కింగ్ నాగ్ పుట్టినరోజు సందర్భంగా మళ్లీ విడుదలకు అక్కినేని అభిమానులు సిద్ధం చేస్తున్నారని తెలిసింది.

Murari Movie Rerelease : మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు(ఆగస్ట్ 9)న మురారి, ఒక్కడు చిత్రాలను రీరిలీజ్ చేయనున్నారు. ముఖ్యంగా ఘట్టమనేని వారి వివాహానికి రావాలంటూ మురారి రీరిలీజ్​కు సరికొత్త ప్రమోషన్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఆహ్వాన పత్రికలు కూడా డిజైన్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. 2001 ఫిబ్రవరి 17న బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ చిత్రం మహేశ్ కెరీర్​లో ఎంత పెద్ద హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించారు. స్పెషల్‌ జ్యూరీ విభాగంలో మహేశ్‌కు నంది పురస్కారం కూడా దక్కింది. ఇక ఒక్కడు చిత్రం కూడా మహేశ్ కెరీర్​లో తొలి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. గుణశేఖర్ దర్శకత్వం వహించారు. భూమిక హీరోయిన్​గా నటించగా ప్రకాశ్​ రాజ్ విలన్​గా కనిపించారు.

ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి : 'కల్కి' సీన్స్​పై అమితాబ్‌

'కల్కి'నే మించేలా త్రివిక్రమ్​-బన్నీ ప్లాన్ - డబ్బులు వెతుక్కొనే పనిలో అల్లు అరవింద్! - Alluarjun Trivikram Movie

ABOUT THE AUTHOR

...view details