తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

టిల్లు బర్త్​డే స్పెషల్ గ్లింప్స్- మూవీ ట్రైలర్ ఎప్పుడంటే?

Tillu Square Birthday Glimpse: టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీ 'టిల్లు స్వ్కేర్'​ నుంచి మేకర్స్ మరో గ్లింప్స్ రిలీజ్ చేశారు.

TILLU SQUARE
TILLU SQUARE

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 6:22 PM IST

Updated : Feb 7, 2024, 7:30 PM IST

Tillu Square Birthday Glimpse:టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీ 'టిల్లు స్వ్కేర్'​ నుంచి మేకర్స్ మరో గ్లింప్స్ రిలీజ్ చేశారు. హీరో సిద్ధూ జొన్నలగడ్డ బర్త్​డే సందర్భంగా మేకర్స్ కామెడీ గ్లింప్స్ రిలీజ్ చేశారు.'మా టిల్లు అన్నకు హ్యాపీ బర్త్​డే. మల్కాజ్​గిరి టిల్లు ఫ్యాన్స్ అసోసియేషన్' అని ఫన్నీ క్యాప్షన్​తో వీడియో విడుదల చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్​ను ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్​గా అనౌన్స్​ చేశారు.

లాస్ట్ ఇయర్ బర్త్​డే రోజు ఎక్కడున్నావ్? అని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అడగ్గానే, డిజే టిల్లు పార్ట్- 1 ఫ్లాష్​బ్యాక్​తో గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. 'నల్లమల ఫారెస్ట్ నల్ల చీర, ఫిల్మ్ బై రాధికా' అనే డైలాగ్​తో సిద్ధూ తన కామెడీ టైమింగ్​తో ఆకట్టుకున్నాడు. 'ఓటీటీటీ పాన్ మల్కాజ్​గిరి మూవీ' అంటూ గ్లింప్స్​లోనే టిల్లు నవ్వులు పూయించేశాడు. ఫుల్ ఆఫ్ కామెడీతో ఉన్న ఈ గ్లింప్స్ మీరూ చూసేయండి!

డిజే టిల్లు పార్ట్- 1 సంచలన విజయం సాధించడం వల్ల సీక్వెల్​పై కూడా హైప్ క్రియేట్ అయ్యింది. ముందుగా చేసిన అనౌన్స్​మెంట్ ప్రకారం ఈ సినిమా 2023 సెప్టెంబర్​లోనే రీలీజ్ కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. మళ్లీ ఏమైందేమో మరోసారి సినిమా పోస్ట్​పోన్ అయ్యింది. ఇక 2024 మార్చి 29న వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా సినిమా రిలీజ్ చేయనట్లున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక మూవీటీమ్ ఇప్పటికే ఈ సీక్వెల్​కు సంబంధించి ఓ గ్లింప్స్, సాంగ్ రిలీజ్ చేసింది. వాటికి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది.

Tillu Square Cast:ఇక టిల్లు స్క్వేర్​ విషయానికి వస్తే, సిద్ధు, అనుపమతో పాటు మురళీధర్ గౌడ్‌, ప్రణీత్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మల్లిక్‌రామ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్​పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

పోస్టర్​తో ఇంటెన్సిటీ పెంచుతున్న సిద్ధు - 'టిల్లు స్వ్కేర్‌'​ ఎప్పుడు రానుందంటే ?

'డీజే టిల్లు- స్క్వేర్​' అప్డేట్​ - రాధిక 'యాంథమ్' రిలీజ్​!

Last Updated : Feb 7, 2024, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details