Ganapath Movie : తెరపైకి వచ్చే ప్రతీ చిత్రం ఎన్నో అంచనాలతో, ఆశలతో తెరకెక్కుతుంటాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్లుగా నిలుస్తాయి. మరికొన్ని డిజాస్టర్లుగా మిగిలిపోతాయి. స్టార్ నటీనటులు, భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవి కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. అలాంటి ఓ చిత్రమే గణపత్. టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఊహించని రేంజ్లో అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.
కథేంటంటే? - గణపత్ సినిమా 2070 కాలం బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కింది. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ప్రతినాయకుల వల్ల కష్టాలను ఎదుర్కొనే ప్రజలను కాపాడేందుకు వచ్చిన రక్షకుడు గణపత్ అనే పాత్రలో హీరో టైగర్ ష్రాఫ్ నటించారు. భారీ విజువల్స్, యాక్షన్‌కు పెద్ద పీట వేస్తూ సినిమాను తెరకెక్కించారు. అలా ట్రైలర్‌తో కాస్త క్యూరియాసిటీని పెంచిన ఈ చిత్రం 2023 అక్టోబర్ 30న మంచి అంచనాలతో విడుదలైంది. కానీ మొదటి షో నుంచే నెగెటివ్ టాక్‌తో డీలా పడింది. కథ బాలేదని, గ్రాఫిక్స్ విషయంలోనూ పేలవంగా ఉందంటూ విమర్శలు వినిపించాయి.
దారుణంగా కలెక్షన్స్ - ఈ చిత్రం దాదాపు రూ.190కోట్ల బడ్జెట్‌తో రూపొందిందని తెలిసింది. కానీ ఫుల్ రన్ టైమ్‌లో రూ.15కోట్ల కలెక్షన్లను కూడా అందుకోలేదని తెలిసింది. రూ.13కోట్ల వసూళ్లే వచ్చాయని బయట కథనాలు ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో ఈ చిత్రం డిజాస్టర్ టాక్‌ను అందుకుందో అర్థం చేసుకోవచ్చు. గుడ్కో, పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వికాస్ బహ్ల్, వషు భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, జాకీ భగ్నానీ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.