తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కొత్త ట్రెండ్​ - పాన్‌ ఇండియా సినిమాలన్నీ ఆ రోజే రిలీజ్! - Thursday Movie Releases 2024 - THURSDAY MOVIE RELEASES 2024

Thursday Movie Releases 2024 : టాలీవుడ్‌లో దాదాపు అన్ని సినిమాలు శుక్రవారం రిలీజ్‌ అవుతుంటాయి. కానీ ఈ సారి అలా కాదు. ట్రెండ్ మారుతూ వస్తోంది. తెలుగులో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీలన్నీ దాదాపుగా ఆ రోజుకు షిఫ్ట్ అయిపోయాయి. పూర్తి వివరాలు స్టోరీలో.

Source Getty images
Thursday Movie Releases 2024 (Source Getty images)

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 8:43 PM IST

Thursday Movie Releases 2024 : ఒకప్పుడు పండగలు దృష్టిలో ఉంచుకొని సినిమాలను రిలీజ్ చేసేవారు. ఆ తర్వాత వీకెండ్ కల్చర్ ఎక్కువ అవ్వడంతో శుక్రవారం ఎక్కువ విడుదల అవ్వడం మొదలయ్యాయి. ఎందుకంటే శుక్రవారంతో పాటు శని ఆదివారం కూడా కలిసొస్తుంది. దీంతో ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అంటే అందరికీ టక్కున శుక్రవారమే గుర్తొస్తుంది. అయితే గత కొంతకాలంగా గమనిస్తే చిన్న చిన్నగా ట్రెండ్ మారుతోంది. వీకెండ్స్​లో లాంగ్ రన్ కోసం ఒక రోజు ముందే అంటే గురువారమే మూవీస్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ​అలా ఈ ఏడాది రానున్న ఆయా బడా హీరోల సినిమాలు గురువారమే రిలీజ్ కానున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే?

కల్కి 2898ఎ.డి(జూన్‌ 27) - అతి త్వరలో జూన్‌ 27న గురువారం భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి 2898ఎ.డి’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీకి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించింది. హీరోయిన్‌గా దీపిక పదుకొణె, కీలక పాత్రల్లో కమల్‌హాసన్, అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ నటిస్తున్నారు.

పుష్ఫ ది రూల్‌(ఆగస్టు 15) - అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో 2021లో రిలీజ్‌ అయిన పుప్ష ది రైజ్‌ సూపర్‌ హిట్ అయింది. ఈ మూవీకి సీక్వెల్‌ రూపొందుతున్న సెకండ్‌ పార్ట్‌ ‘పుష్ప ది రూల్‌’ వేగంగా షూటింగ్‌ జరుపుకొంటోంది. ఈ సినిమా ఆగస్టు 15న గురువారం రిలీజ్‌ కానుంది. హీరోయిన్‌గా రష్మిక, విలన్‌ రోల్‌లో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌పై ఈ భారీ మూవీని నిర్మిస్తోంది.

సరిపోదా శనివారం(ఆగస్టు 29) - నేచురల్ స్టార్ నాని రాబోయే పాన్ ఇండియా మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఇటీవలే మూవీ టీమ్‌ క్లైమాక్స్‌ షూటింగ్‌ను ప్రారంభించింది. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్‌ను నిర్మించింది. 2024 ఆగస్టు 29న గురువారం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో రిలీజ్‌ కానుంది.

దేవర(అక్టోబరు 10) - జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో, పాన్‌ ఇండియా మూవీ ‘దేవర’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌, విలన్‌గా సైఫ్‌ అలీఖాన్‌ యాక్ట్‌ చేస్తున్నారు. దేవర ఫస్ట్‌ పార్ట్ అక్టోబరు 10న గురువారం రిలీజ్‌ కానుంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

నా బాడీ సూపర్ డీలక్స్​ : బిగ్​బాస్ బ్యూటీ అషురెడ్డి - Yevam Movie Teaser

ఆనంద్ దేవరకొండ వెంట పడిన 25 మంది తమిళ దర్శకులు!

ABOUT THE AUTHOR

...view details