మీకు ఎప్పుడైనా లెజెండరీ డైరెక్టర్, సూపర్ స్టార్ల కాంబోలో వచ్చిన పాత హిట్ మూవీ కనిపిస్తే? ఏమనుకుంటారు? అప్పట్లో భారీ థియేటర్లలో విడుదలై ఉంటుంది, బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించి ఉంటుందని అనుకుంటారు. అయితే కొన్ని సార్లు ఇది అన్ని సినిమాలకు వర్తించకపోవచ్చు. అవును మీ ఊహకు భిన్నంగానే అప్పట్లో ఓ సినిమా రిలీజ్ అయింది. అతి తక్కువ థియేటర్లలో విడుదలైనా, కూడా నేటికీ ప్రేక్షకుల మనసులో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆ సినిమా ఏంటి? ఆ మూవీ కోసం ఏయే ప్రముఖులు కలిసి పని చేశారు? ఇప్పుడు తెలుసుకుందాం.
1973లో వచ్చిన 'దాగ్' అనే సినిమాను యశ్ చోప్రా తెరకెక్కించారు. ఇందులో దివంగత నటుడు రాజేశ్ ఖన్నాతో పాటు అలనాటి అందాల తారలైన రాఖీ, షర్మిలా ఠాగూర్ నటించారు. అప్పట్లో ఈ కాంబోలో సినిమా తెరకెక్కడం పెద్ద విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఆ కాలంలో వారి వారి ఫీల్డ్‌లో వీరు సూపర్ స్టార్లే. అయితే ఈ చిత్రం కేవలం 9 థియేటర్లలో మాత్రమే విడుదలైంది. మొదట్లో ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేకపోయినా, ఆ తర్వాత ప్రజల హృదయాలను హత్తుకున్న ఈ చిత్రం కొద్ది రోజులకే క్రమ క్రమంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
అయితే ఈ మూవీ విడుదలైన సమయంలో రాజేశ్ ఖన్నా కూడా బాక్సాఫీస్ వద్ద తనకు ఎదురైన రెండు ఫ్లాప్‌ల దెబ్బ నుంచి నుంచి కోలుకుంటున్నాడు. అయితే ఈ సినిమా అందరి కెరీర్‌ను మార్చేస్తుందని, ఓ రేంజ్లో సూపర్ హిట్ అవుతుందని యశ్ చోప్రా గ్రహించేందుకు కేవలం మూడు షో లే పట్టింది.