This Week Theatre And OTT Release :దసరా పండగకు బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొననుంది. తెలుగు సినిమాలతోపాటు పలు డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితోపాటుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win)లో రెండు తెలుగు వెబ్‌సిరీస్‌లు రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. వీటిలోపాటు ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌పై లుక్కేయండి.
వేట్టయాన్: సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్లో 'వేట్టయాన్' సినిమా తెరకెక్కింది. 'జైభీమ్' ఫేమ్ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10 గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
విశ్వం: మ్యాచో స్టార్ గోపీచంద్ - శ్రీనువైట్ల కాంబోలో విశ్వం తెరకెక్కింది. వినోదంపాటు కమర్షియల్ కథగా ఈ సినిమాను శ్రీనువైట్ల తెరకెక్కించారు. దాదాపు ఆరేళ్ల తర్వత ఆయన దర్శకత్వం వహించిన సినిమా, అక్టోబర్ 11న థియేటర్లలలో సందడి చేయనుంది. కావ్యా థాపర్ హీరోయిన్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
జనక అయితే గనక: యంగ్ హీరో సుహాస్ ఈసారి 'జనక అయితే గనక' తో ప్రేక్షకులకను నవ్వించడానికి వస్తున్నారు. సందీప్ బండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించారు. అక్టోబర్ 12న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
మా నాన్న సూపర్ హీరో: సుధీర్ బాబు హీరోగా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర దర్శతక్వంలో ఇది తెరకెక్కింది. సాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కథానాయకుడిగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. ఆర్ణ కథానాయిక. షాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో అంచనాలు నెలకొన్నాయి.
మార్టిన్: ధ్రువ సర్జా హీరోగా నటించిన 'మార్టిన్' సినిమా అక్టోబర్ 11న బరిలో దిగనుంది. ఈ సినిమాకు ఎ.పి.అర్జున్ దర్శకత్వం వహించారు. వైభవి శాండిల్య హీరోయన్. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.