This Week Movie Releases :గతవారం దీపావళి సందర్భంగా విడుదలైన పలు సినిమాలు ఘన విజయం సాధించాయి. ఓ వైపు ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండగా, ఈ వారం థియేటర్లలో రిలీజ్‌కు మరికొన్ని మూవీస్ రెడీ అవుతున్నాయి. అందులో సమంత 'సిటాడెల్', నిఖిల్ సిద్ధార్థ్ 'అక్కడో ఇక్కడో ఎక్కడో' కూడా ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో చూసేయండి
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో : యంగ్ హీరో నిఖిల్ లీడ్‌లో తెరకెక్కిన సినిమా 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. దీనికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. అయితే 'స్వామిరారా', 'కేశవ' సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ మూవీ రానుండడం వల్ల దీనిపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. రుక్మిణీ వసంత్, దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జితేందర్‌రెడ్డి : 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు విరించి వర్మ తెరకెక్కించి సినిమా 'జితేందర్‌రెడ్డి'. 'బాహుబలి' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్‌వర్రే హీరోగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి రీసెంట్గా ట్రైలర్ రిలీజైంది. కాగా, నవంబర్ 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ధూం ధాం : యువ నటీనటులు చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా 'ధూం ధాం'. ఈ సినిమాకు ఎంఎస్ రామ్‌కుమార్ దర్శకత్వం వహించారు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 8న థియేటర్లలోకి రానుంది.
లిస్ట్‌లో ఈ సినిమాలు కూడా
- బ్లడీ బెగ్గర్ (తమిళ్ రీమేక్)- నవంబర్ 07
- జాతర- నవంబర్ 08
- రహస్యం ఇందం జగత్- నవంబర్ 08
- జ్యూయల్ థీప్- నవంబర్ 08
- వంచన- నవంబర్ 08
- ఈసారైనా- నవంబర్ 08
ఓటీటీల్లో రానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు