This week OTT Releases :చిన్న చిత్రాల సందడితో మే ముగిసింది. ఇక జూన్ నెల మొదలైపోయింది. మళ్లీ ఎప్పటిలాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైపోయాయి. మొత్తంగా 20కుపైగా చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తున్నాయి. వాటిలో వైవిధ్యమైన కథలతో అలరించేందుకు ప్రయత్నించే హీరో శర్వానంద్ సినిమా కూడా ఉంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వా-కృతిశెట్టి కలిసి నటించిన మనమే(Sharwanand Manamey Movie) ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. ఇదొక మ్యూజికల్ ఫిల్మ్ అని మూవీటీమ్ చెబుతోంది.
సత్యరాజ్, వసంత్ రవి కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ సినిమా వెపన్(Sathyaraj Weapon Movie). ఇది కూడా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. గుహన్ సెన్నియ్యప్పన్ దర్శకత్వం వహించారు. డీసీ, మార్వెల్ తరహాలో సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు.
పాయల్ రాజ్‌పుత్ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ రక్షణ(Payal Rajput Rakshana Movie). ప్రణదీప్ ఠాకూర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ మూవీ జూన్ 7న రానుంది. ఒక పోలీసు ఆఫీసర్ లైఫ్‌లో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించారు.
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు /వెబ్ సిరీస్‌లివే!
డిస్నీ+హాట్‌స్టార్‌లో
స్టార్‌వార్స్: ది ఎకోలైట్ (వెబ్‌సిరీస్)- జూన్ 04
క్లిప్ప్‌డ్- (వెబ్‌సిరీస్)- జూన్ 04
గునాహ్ (హిందీ సిరీస్)- జూన్ 05
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ (హిందీ సిరీస్)- జూన్ 05
అమెజాన్ ప్రైమ్‌లో
మైదాన్ (హిందీ)- జూన్ 05
నెట్‌ఫ్లిక్స్‌లో
షూటింగ్ స్టార్స్ (హాలీవుడ్)- జూన్ 03
హౌటూ రాబ్ ఎ బ్యాంక్ (హాలీవుడ్)- జూన్ 05
హిట్లర్ అండ్ నాజీస్ (వెబ్‌సిరీస్)- జూన్ 05