This Week OTT And Movie Releases:'కల్కి 2898 AD' సినిమాతో ప్రభాస్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. జూన్ 27న రిలీజైన్ ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో థియేటర్లలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రేమికులను అలరించడానికి మరో భారీ బడ్జెట్ పాన్ఇండియా మూవీ సిద్ధమైంది. మరి థియేటర్‌తోపాటు, ఓటీటీలో ఈ వారం ప్రేక్షకులను అలరించనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో తెలుసా?
'భారతీయుడు- 2'
లోకనాయకుడు కమల్ హాసన్- శంకర్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'భారతీయుడు- 2'. 1996లో రిలీజైన బ్లాక్‌బస్టర్ 'భారతీయుడు'కు సీక్వెల్‌గా పాన్ఇండియా రేంజ్లో ఈ సినిమా రూపొందింది. అవినీతి, లంచగొండితనంపై ప్రతి ఒక్కరినీ 25ఏళ్ల కిందట ఆలోచింపజేసిన ఈ సినిమా మరోసారి సీక్వెల్‌తో రెడీ అయ్యింది. రెండు పార్ట్‌లుగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో జులై 12న తొలి పార్ట్ వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కమల్‌హాసన్‌తోపాటు సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య, బాబీ సింహా, బ్రహ్మానందం, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు.
'సారంగదరియా'
సీనియర్ నటుడు రాజా రవీంద్ర కీలక పాత్రలో నటించిన సినిమా 'సారంగదరియా'. దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి ఈ సినిమా తెరకెక్కించారు. మధ్య తరగతి కుటుంబంలో జరిగిన సంఘర్షణల నేపథ్యంలో సాగే చిత్రమిదని, ఇంటిల్లిపాదికీ నచ్చేలా ఉండనుందని మూవీ యూనిట్ పేర్కొంది. జులై 12న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఓటీటీలో రానున్న సినిమాలు/సిరీస్‌లివే!
ధూమం:మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన సినిమా 'ధూమం'. గతేడాది రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. దీంతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో జూలై 11న రానుంది.