Telugu Love Tracks Valentine Week SPL:వాలెంటైన్ వీక్ వచ్చేసింది. ప్రపోజ్ డే, రోజ్ డే, చాకొలెట్ డే, హగ్ డే అంటూ ఇలా వారం రోజులపాటు 'వాలెంటైన్ డే'ను కపుల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరు ప్రేయసికి గిఫ్ట్‌లు ఇస్తే, ఇంకొందరు లంఛ్, డిన్నర్, ఔటింగ్ ఇలా డిఫరెంట్‌గా ఇంప్రెస్ చేస్తారు. మరికొందరు మ్యూజిక్ లవర్స్ ఉంటారు. పార్ట్నర్ కోసం స్పెషల్‌గా సాంగ్ కంపోజ్ చేయిస్తారు. ఇంకొందరు తమకు ఇష్టమైన లవ్ సాంగ్‌ను పార్ట్నర్కు డెడికేట్ చేస్తారు. అయితే తెలుగులో లవ్ బేస్డ్ చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాల్లోని పాటలు దశాబ్దాలు గడుస్తున్నా ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తాయి. అలా తెలుగులో ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని లవ్ ట్రాక్స్ ఇక్కడ చూద్దాం.
రోజా రోజా: వాలెంటైన్ డై అనగానే కపుల్స్‌కు గుర్తొచ్చే సినిమాల్లో 'ప్రేమికుల రోజు' ఒకటి. 1999లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం దక్కించుకుంది. కునల్- సోనాలి బింద్రే లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికీ చాలా మంది ఫెవరెట్ లిస్ట్‌లో ఉంటాయి. అందులో 'రోజా రోజా', 'వాలు కనులదాన' పాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ప్రియతమ ఓ ప్రియతమా:ఉదయ్‌కిరణ్ బ్లాక్ బస్టర్ మూవీ 'నువ్వు నేను' అప్పట్లో కుర్రకారును బాగా ఆట్రాక్ట్ చేసింది. ఈ సినిమాలోని 'ప్రియతమా ఓ ప్రియతమా' పాట టీనేజ్ యువతీయువకుల ప్లే లిస్ట్‌లో రిపీటెడ్ మోడ్‌లో ఉండాల్సిందే.
హయ్ రబ్బా: 1998లో సెన్సెషనల్ హిట్‌గా నిలిచిన సినిమా 'జీన్స్'. ఈ సినిమాలో ప్రశాంత్- ఐశ్వర్యరాయ్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాలో అన్ని పాటలు గుర్తుండిపోయేవే. అందులో హయ్ రబ్బా పాట మాత్రం మ్యూజిక్ లవర్స్‌కు ఎప్పటికీ స్పెషలే.