Rajinikanth Coolie Release Date : సూపర్ స్టార్ రజనీకాంత్ రీసెంట్గా 'వేట్టయన్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ నడుమ వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో బాగా రన్ అయ్యింది. ముఖ్యంగా ఇందులో రజనీ యాక్షన్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆయన ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్‌తో కలిసి 'కూలీ' అనే చిత్రం కోసం వర్క్ చేస్తున్నారు. ఇందులో రజనీతో పాటు పలు ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని మూవీ పోస్టర్లు, అలాగే టైటిల్ టీజర్ కూడా అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలే పెంచుతున్నాయి.
అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌కి సంబంధించిన ఓ రూమర్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. వచ్చే ఏడాది మార్చికి థియేటర్లలోకి రాబోతుందని అందరూ అనుకోగా, ఇప్పుడు ఈ సినిమా కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1 న విడుదల కానుందట. మూవీ పేరుకు తగ్గట్లుగా, ఆ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక కూలీ సినిమా విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు చక చక సాగుతోంది. రజనీ అనారోగ్యంతో పాటు ఇతర కారణాల వల్ల కాసేపు బ్రేక్ పడగా, మళ్లీ ఇప్పుడు చిత్రీకరణ వేగం పుంజుకుంటోంది. బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఓ స్టోరీని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు లోకేశ్ కనగరాజ్. రజనీ- లోకేశ్ కాంబోలో రానున్న తొలి సినిమా కావడం వల్ల అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
మరోవైపు ఇందులో రజనీ ఓ గోల్డ్ స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రీసెంట్గా విడుదలైన టైటిల్ రివీల్ వీడియోలో ఆయన లుక్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, సత్యరాజ్, మంజుమ్మెల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరా అన్న విషయంపై క్లారిటీ లేదు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.