ETV Bharat / entertainment

18 ఏళ్ల తర్వాత హిట్‌ కాంబో - స్పెషల్ అప్డేట్​ ఇచ్చిన అనిల్‌ రావిపూడి - VENKATESH RAMANA GOGULA

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్‌డేట్‌ను ఇచ్చిన మూవీటీమ్.

Venkatesh Anil Ravipudi Sankranthiki Vasthunnam
Venkatesh Anil Ravipudi Sankranthiki Vasthunnam (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 5:31 PM IST

Venkatesh Anil Ravipudi Sankranthiki Vasthunnam : టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్‌ అప్డేట్​ను మూవీ టీమ్ ఇచ్చింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల ఈ సినిమా కోసం పని చేయబోతున్నారని తెలిపింది.

సంగీత దర్శకుడిగా, సింగర్‌గా రమణ గోగులకు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే. 'తమ్ముడు', 'బద్రి', 'జానీ', 'లక్ష్మీ', 'యోగి' వంటి సినిమాలకు ఆయన సంగీత దర్శకుడిగా పని చేశారు. పలు చిత్రాల్లో ఆయన పాటలు కుడా పాడారు. అవి సినీ ప్రియులను, శ్రోతలను ఎంతగానో అలరించాయి.

అయితే 2013లో రిలీజైన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, 1000 అబద్ధాలు సినిమాల తర్వాత రమణ సినీ పరిశ్రమకు దూరమయ్యారు. ప్రస్తుతం ఇతర వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు దాదాపు 11 ఏళ్ల తర్వాత మళ్లీ గాయకుడిగా తన గాత్రాన్ని వినిపించిందేకు సిద్ధమయ్యారు. వెంకటేశ్​ సంక్రాంతికి వస్తున్నాంలో స్పెషల్‌ సాంగ్‌ ఆలపించనున్నారు. ఈవిషయాన్ని తెలియజేస్తూ అనిల్‌ రావిపూడి అఫీషియల్​గా పోస్ట్‌ కూడా పెట్టారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత వెంకటేశ్‌, రమణ గోగుల హిట్‌ కాంబోలో పాట రాబోతున్నట్లు తెలిపారు.

కాగా, 'ఎఫ్‌ 2', 'ఎఫ్‌ 3' తర్వాత హీరో వెంకటేశ్‌ - దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్​పై దిల్‌ రాజు దీనిని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కూడా విడుదలై సినీ ప్రియులను ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి మార్క్‌ ఫన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది సిద్ధమవుతోంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భగవంత్‌ కేసరి తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిదే. ముక్కోణపు క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో వెంకటేశ్‌ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. రాజేంద్రప్రసాద్, సాయికుమార్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

'చాలా బాధగా ఉంది' - 'పుష్ప 2' గురించి మాట్లాడిన రష్మిక

OTT లవర్స్​కు హీరో రానా అదిరే సర్​ప్రైజ్​ - ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.