ETV Bharat / entertainment

'చాలా బాధగా ఉంది' - 'పుష్ప 2' గురించి మాట్లాడిన రష్మిక - RASHMIKA PUSHPA 2 DUBBING

'పుష్ప 2' షూటింగ్ అప్డేట్​ ఇచ్చిన హీరోయిన్ రష్మిక

Pushpa 2 Shooting Update Rashmika
Pushpa 2 Shooting Update Rashmika (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 4:35 PM IST

Pushpa 2 Shooting Update Rashmika : ఇండియన్ బాక్సాఫీస్‌ వద్ద పుష్ప రూల్‌కు సమయం దగ్గరవుతోంది. మరో రోజుల్లో 22 రోజుల్లో పుష్ప ది రూల్‌ ప్రేక్షకుల ముందుకు గ్రాండ్​గా రానుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 చిత్రీకరణకు సంబంధించి హీరోయిన్ రష్మిక ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. షూటింగ్​ ఆద్యంతం ఎంతో సరదా జరిగిందని చెప్పారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు (Pushpa 2 Dubbing) జరుగుతున్నాయని అన్నారు. డబ్బింగ్‌ స్టూడియోలో తాను దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.

"ఫన్‌, గేమ్స్‌ పూర్తైపోయ్యాయి. పనిలో బిజీ అయ్యాను! పుష్ప ది రూల్‌ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయింది. ఫస్టాఫ్‌ డబ్బింగ్‌ పనులు కూడా కంప్లీట్ చేశాను. ఇప్పుడు సెకండాఫ్‌ కోసం డబ్బింగ్‌ చెబుతున్నాను. ఫస్టాఫ్‌ అద్భుతంగా ఉంది. సెకండాఫ్‌ అంతకు మించి ఉంటుంది. మాటల్లో చెప్పలేను. మీరు కచ్చితంగా మైండ్‌ బ్లోయింగ్‌ అనుభూతిని పొందుతారు. ఈ చిత్రాన్ని మీకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. చిత్రీకరణ పూర్తి అవుతున్నందుకు బాధగా ఉంది" అని రష్మిక చెప్పారు.

2021లో రిలీజైన పుష్ప ది రైజ్‌కు కొనసాగింపుగా పుష్ప ది రూల్ రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ - దర్శకుడు సుకుమార్‌ కాంబోలో ఇది తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్​పై భారీ బడ్జెట్​తో నిర్మించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌, శ్రీవల్లిగా రష్మిక కనిపించగా భన్వర్ సింగ్ షెకావత్ అనే పవర్​ఫుల్​ పోలీస్​గా ఫహాద్ ఫాజిల్ నటించారు​. తొలి భాగం స్పెషల్‌ సాంగ్​లో ఊ అంటావా మావ అంటూ సమంత చిందులేయగా, రెండో భాగంలో శ్రీలీల డ్యాన్స్‌ చేయనుంది. సినిమా దాదాపు మూడు గంటల నిడివి ఉంటుందని సమాచారం. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లో రిలీజ్ చేయనున్నారు. భారత్​లో 6,500, ఓవర్సీస్‌లో 5,000 స్క్రీన్స్‌లో తీసుకురానున్నారు.

OTT లవర్స్​కు హీరో రానా అదిరే సర్​ప్రైజ్​ - ఏంటో తెలుసా?

'హ్యారీపోటర్‌'లా ప్రభాస్‌ సినిమా - ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.