Tasks for Ration in Bigg Boss:బిగ్‌బాస్ హౌజ్‌లో రేషన్ గెలుచుకోవడానికి కంటెస్టెంట్లు నానా తంటాలు పడుతున్నారు. ఈ సీజన్లో 'నో రేషన్' అంటూ నాగార్జున ముందే చెప్పారు. అయితే ఫస్ట్ వీక్ మాత్రం అందరికీ ఫ్రీ రేషన్ అంటూ బిగ్‌బాస్ ఇచ్చేశాడు. కానీ ఈ వారం నుంచి 'నో రేషన్'ను పక్కాగా అమలు చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే ఇంట్లో ఉన్న రేషన్ మొత్తం స్టోర్ రూమ్‌లో పెట్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలలో మూడు టీమ్‌లకి రేషన్ సంపాదించుకోవడం కోసం టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. ఇక ఇందులో ఏ టీమ్ గెలిచింది? గెలిచిన టీమ్‌కే రేషన్ ఇస్తే ఓడిపోయిన టీమ్ సభ్యులు పస్తులుండటమేనా? అసలు లేటెస్ట్ ప్రోమో ప్రకారం హౌస్‌లో ఏ టీమ్ గెలిచింది.. ఏం జరిగిందో అలా ఓ లుక్కేద్దాం.
మొదటి ప్రోమో: ముందుగా వదిలిన ప్రోమోలో ముగ్గురు చీఫ్‌లకి కాస్త టైమ్ ఇచ్చి హౌజ్‌లో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ నుంచి ఈ వారానికి సరిపడా రేషన్‌ను తెచ్చుకోవాలంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ముగ్గురు చీఫ్‌లు యష్మీ, నైనిక, నిఖిల్.. పరుగుపరుగున వెళ్లి బాగానే పట్టుకొచ్చారు. తెచ్చిన రేషన్‌ను గెలుచుకోవాలంటే టాస్కులో నెగ్గాల్సిందే అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అందులో భాగంగానే 'లెమన్ పిజ్జా' అనే టాస్కు పెట్టాడు. ఈ గేమ్ ప్రకారం ఏ టీమ్ అయితే ముందుగా నిమ్మకాయలను బోర్డ్ నుంచి బయటకి తీసి ఎక్కువ రౌండ్స్ గెలుస్తుందో వాళ్లే విన్నర్. అలా గెలిచిన టీమ్ వాళ్ల చీఫ్ షాపింగ్ చేసిన రేషన్‌ను సంపాదించుకున్నట్లన్నమాట. ప్రోమోలో మూడు టీమ్‌లు పోటాపోటీగా ఆడాయి. కానీ ప్రోమో చివరిలో బజర్ మోగిన సమయంలో సంచాలక్ శేఖర్ బాషాపై మణికంఠ సీరియస్ అయినట్లు చూపించారు. అయితే ఈ గేమ్‌లో యష్మీ టీమ్ గెలిచి రేషన్ దక్కించుకుందని సమాచారం.
బిగ్ బాస్ 8 : నువ్వు ఉండాల్సినోడివేనయ్యా - శేఖర్ బాషా కామెడీ అరాచకం! - సోషల్ మీడియాలో వైరల్
ఇక రెండో ప్రోమోలో.. తాజాగా రెండో ప్రోమోలో.. నిఖిల్-నైనిక టీమ్‌లకి మరో టాస్కు ఇచ్చాడు బిగ్‌బాస్. "సరుకులు గెలిచేదెవరో.. ఒట్టి చేతులతో వెనుదిరిగేదెవరో తెలుసుకునేందుకు బిగ్‌బాస్ ఇస్తున్న ఆఖరి అవకాశం" అంటూ చెప్పాడు. నిఖిల్ టీమ్ నుంచి మణికంఠ.. నైనిక టీమ్ నుంచి సీత ఈ గేమ్‌లో పోటీ పడ్డారు. హౌస్‌లో ఒక్కో చోట కొన్ని ఫుడ్ ఐటెమ్స్ పెట్టి చెప్పిన వెంటనే వాటిని ఎవరు తీసుకువస్తారో వాళ్లే విన్నర్ అంటూ చెప్పాడు బిగ్‌బాస్. ఇక ఇందులో ముందుగా "శనగపప్పు" అని చెప్పగానే మణికంఠతో పోటీ పడి మరీ ముందుగా తెచ్చింది కిర్రాక్ సీత. ఆ తర్వాత టమాట బుట్టలో యాపిల్‌ని అడగ్గా మణికంఠ తీసుకొచ్చాడు. ఇక చివరగా కొలతకి ఏం ఇవ్వకుండా 250 గ్రాముల మరమరాలు అడిగాడు బిగ్‌బాస్. ఇక దీన్ని తూకం వేసి ఎవరు కరెక్ట్‌గా తెచ్చారో చెప్పే బాధ్యత చీఫ్ యష్మీకి ఇచ్చాడు.