Tapsee Pannu Marriage :టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సి. రీసెంట్‌గానే ఈ ముద్దుగుమ్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 23న ఉదయ్ పూర్లో సన్నిహితుల సమక్షంలో తన బాయ్‌ఫ్రెండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను(Tapsee Boyfriend) వివాహం చేసుకుంది. ఈ వేడుకకు స్నేహితులు పావైల్ గులాటి, అభిలాశ్, కనికా దిల్లాన్తో పాటు తాప్సి సోదరి షగున్ హాజరై సందడి చేశారు.
అయితే ఈ పెళ్లి విషయాన్ని తాను సీక్రెట్‌గా ఉంచడంపై తాజాగా మాట్లాడింది తాప్సీ. అది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమని చెప్పింది. బయటకు చెప్పుకోవడం తనకు ఇష్టం లేదని పేర్కొంది. తన సన్నిహితులు, కుటుంబసభ్యుల అంగీకారంతోనే చేసుకున్నట్లు స్పష్టత ఇచ్చింది.
"నాకు ఇప్పటికీ కూడా నా వ్యక్తిగత జీవితం గురించి కానీ నా వ్యక్తిగత జీవితంలో ఉన్న మనుషుల గురించి కానీ అందరితో పంచుకోవాలని లేదు. పెళ్లి అనేది వ్యక్తిగతం. నా పెళ్లి వేడుకలో నాకు కావాల్సిన వాళ్లు, అలాగే ఈ బంధం గురించి మొదటి నుంచి తెలిసినవాళ్లు పాల్గొన్నారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అందుకే నాకు దగ్గరైన వాళ్ల మధ్య చేసుకున్నాను. అయితే ఈ పెళ్లిని రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం నాకు లేదు. ఒ ఈ వేడుకకు సంబంధించిన విశేషాలను ఎప్పుడు పంచుకోవాలి అనిపిస్తే అప్పుడే షేర్ చేస్తాను" అంటూ చెప్పింది.
Tapsee Upcoming Movies : కాగా, తాప్సి ప్రస్తుతం సూపర్ హిట్ అయిన హసీనా దిల్ రుబా సినిమాకు సిక్వెల్‌గా తెరకెక్కుతున్న ఫిర్ ఆయి హసీనా దిల్ రుబాలో నటిస్తోంగి. తాప్సితో పాటు విక్రాంత్ మాస్సే కూడా నటిస్తున్న ఈ చిత్రాన్ని జయప్రద్ దేశాయ్ తెరకెక్కిస్తున్నారు. తాప్సి నటించిన మరో రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాదు ఇటీవల వచ్చిన ధక్ ధక్ అనే చిత్రంతో నిర్మాతగా మారింది తాప్సి.