TAMANNAH BHATIA NEW WEB SERIES : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రమే పరాజయం అయినప్పటికీ ముందుకు సాగింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
ఇండస్ట్రీలో యువ హీరోయిన్ల జోరు ఉన్నప్పటికీ వారికి గట్టి పోటీనిస్తూ వరుస ప్రాజెక్ట్‌లను చేస్తోంది. ఆ మధ్య ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి విజయాల్ని అందుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రీతీ సిమోస్ నిర్మించనున్న ఓ కొత్త ఓటీటీ సిరీస్‌లో మిల్కీ బ్యూటీ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న ఈ సిరీస్‌లో తమన్నా న్యాయవాదిగా కనిపించబోతున్నట్లు టాక్.