Tamannaah IPL Streaming :ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను అక్రమంగా 'ఫెయిర్ ప్లే' అనే యాప్‌లో స్ట్రీమ్ చేసిన కేసులో బాలీవుడ్ బ్యూటీ తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్ పోలీసు విభాగం సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను ప్రశ్నించేందుకు ఈ నోటీసులిచ్చినట్లు పేర్కొంది. అంతే కాకుండా ఈ నెల 29న సైబర్ విభాగం ఎదుట తమన్నా విచారణకు హాజరు కావాలని సూచించింది.
నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఈ యాప్‌లో ప్రసారం చేయడం వల్ల ప్రముఖ మీడియా సంస్థ 'వయాకామ్' మీడియాకు రూ. కోట్ల మేర నష్టం జరిగిందంటూ సైబర్ విభాగం తాజాగా వెల్లడించింది.
ఇక ఇదే కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఏప్రిల్ 23న ఆయన్ను విచారణకు రావాలని ఆదేశించగా, సంజత్ ఆ విచారణకు గైర్హాజరయ్యారు. అయితే ఆ సమయంలో తాను దేశంలో లేనని, వాంగ్మూలం ఇచ్చేందుకు మరో తేదీని కేటాయించాలని దత్ కోరారు.
ఎంటి ఈ 'ఫెయిర్ ప్లే'?
'ఫెయిర్ ప్లే' అనే యాప్ మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్‌కు ఓ అనుబంధ సంస్థ. ఇందులో ఐపీఎల్ మ్యాచ్‌లను స్ట్రీమ్ చేసేందుకు ఎలాంటి అధికారిక బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు లేవు. అయినప్పటికీ గతేడాది నిబంధనలకు విరుద్ధంగా కొన్ని మ్యాచ్‌లను ఈ యాప్‌లో ప్రసారం చేశారు. అయితే వాటిని చూడాలంటూ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రచారం చేశారు.