Tamannaah On Prabhas :టాలీవుడ్‌లోనే కాదు మూవీ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ప్రభాస్ ఒకరు. చాలా సార్లు ప్రభాస్ పెళ్లి టాపిక్ సోషల్ మీడియా ట్రెండ్ అయ్యింది. ముఖ్యంగా హీరోయిన్లు కృతి సనన్, అనుష్క శెట్టితో డేటింగ్ చేసినట్లు ప్రచారం సాగింది. కానీ, వీటిపై ప్రభాస్ ఎప్పుడూ నోరు విప్పలేదు.
మూవీ ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు, టీవీ షోలలో ప్రభాస్‌కి తరచూ పెళ్లెప్పుడు? అనే ప్రశ్న ఎదురవుతుంటుంది. దీనికి అతడి నుంచి చిరునవ్వే సమాధానంగా వస్తుంటుంది. అయితే ప్రభాస్ పెళ్లి గురించి తన కో- సార్ట్ తమన్నా భాటియా ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. 'బాహుబలి' తర్వాత, దేశంలో చాలా మంది అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నారని చెప్పింది.
'నాకు తెలిసి చాలా మంది ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. మన సినిమాల గురించి ఇతర రాష్ట్రాలకు పెద్దగా తెలియనప్పుడు కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే అతడికి ఫాలోయింగ్ ఉందనుకున్నాను. బాహుబలి రిలీజ్ తర్వాత యావత్ దేశంలోని అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. బాహుబలిలో అమరేంద్ర బాహుబలి పాత్రలాగానే ప్రభాస్ నిజ జీవితంలో కూడా చాలా సాధారణంగా ఉంటాడు. అతను రాజు లాంటివాడు. మనసు చాలా సున్నితంగా, దయతో ఉంటుంది. అతడికి బలమైన వ్యక్తిత్వం కూడా ఉంది' అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తమన్నా చెప్పింది