Zakir Hussain Passed Away :ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే ఆరోగ్యం విషమించడం వల్ల తుదిశ్వాస విడిచారు. తబలా మ్యాస్ట్రోగా ప్రఖ్యాతిగాంచిన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబయిలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన జాకీర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్‌లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు.
తబలా మ్యాస్ట్రో జాకీర్ హుస్సేన్ కన్నుమూత - ZAKIR HUSSAIN PASSED AWAY
తబలా మ్యాస్ట్రో జాకీర్ హుస్సేన్ కన్నుమూత
Published : 5 hours ago
|Updated : 5 hours ago
1990లో సంగీత్‌నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది. జాకీర్ హుస్సేన్ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన, ఈ ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని కైవసం చేసుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మన దేశంతోపాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు.