Taapsee Pannu Marriage Year :బాలీవుడ్ బ్యూటీతాప్సీ పన్ను తాజాగా తన పెళ్లి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. నటి తాప్సీ పన్ను. అందరూ అనుకుంటున్నట్లు తన వివాహం ఈ ఏడాదిలో జరగలేదని 2023లోనే జరిగిందని చెప్పింది. తాజాగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్ నిర్వహించిన మీట్లో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని తెలియజేసింది.
"మా పెళ్లి గతేడాది డిసెంబర్‌లోనే జరిగింది. అయితే మేము ఇరు కుటుంబాలు అలాగే కొంతమంది సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. త్వరలోనే మా ఫస్ట్ యానివర్సరీ రానుంది. నేడు ఈ విషయాన్ని నేను బయటపెట్టకపోతే ఎవరికీ దీని గురించి అస్సలు తెలియకపోవచ్చు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించి సరైన బ్యాలెన్స్ ఉండాలనే మేము ఎప్పుడూ అనుకున్నాం. మన లైఫ్‌కి సంబంధించిన కొన్ని విషయాలు బయటపెడితే అది వృత్తిపరమైన విషయాలకు ఆటంకంగా మారుతుంది. అదేవిధంగా వర్క్ లైఫ్‌లో సక్సెస్ లేదా ఫెయిల్యూర్స్ ఉంటే అవి అధికంగా పర్సనల్ లైఫ్‌పై ప్రభావం చూపిస్తాయి. దీని కారణంగా లేనిపోని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అది మాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే పర్సనల్ విషయాలను మేము పెద్దగా బయటకు చెప్పాలనుకోము. డిసెంబర్‌లో పెళ్లి తర్వాత ఆత్మీయులు, సన్నిహితుల కోసం ఉదయ్‌పుర్‌లో ఓ ప్యాలెస్‌లో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాం. అయితే ఆ వేడుకకు ఆత్మీయులను మాత్రమే ఆహ్వానించాం. అంతేకానీ దాని గురించి ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు. అందువల్లనే మా పెళ్లిని అందరూ సీక్రెట్ మ్యారేజ్ అని అనుకున్నారు" అని తాప్సీ అసలు విషయం చెప్పుకొచ్చింది.