Taapsee Pannu Marriage Video :బాలీవుడ్ స్టార్ హీరోయిన్తాప్సీ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బో ను ఆమె పెళ్లి చేసుకుంది. అయితే ఈ అమ్మడి పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. దీంతో వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎక్కడ కనబడలేదు. కానీ తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అందులో పెళ్లికూతురు గెటప్‌లో కనిపించింది తాప్సీ. తన ప్రియుడు దగ్గరికి డ్యాన్స్ చేసుకుంటూ వెళ్లింది.
ఇక పంజాబీ స్టైల్లో వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి అవుట్‌ఫిట్ చూస్తుంటే ఈ విషయం తెలుస్తోంది. వీరిద్దరు పెద్దలను ఒప్పించి మార్చి 23న ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఫొటోలు, వీడియోలు మాత్రం బయటకు రాలేదు. తాప్సీ కూడా పెళ్లికి సంబంధించి ఎలాంటి పోస్టులు పెట్టలేదు.
అయితే ఈ పెళ్లి ఎప్పుడో జరిగినట్లు సమాచారం. మార్చి 24న ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగినట్లు సమాచారం. తాప్సీ నటించిన తప్పడ్ సినిమాలోని సహనటుడు పవైల్ గులాటీ, క్లోజ్ ఫ్రెండ్స్ అయిన అభిలాష్ తాప్లియాల్, స్క్రీన్ ప్లే రైటర్ కనికా దిల్లోన్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. వరుడు తరఫున సాత్విక్ సాయి రాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పెళ్లికి విచ్చేసినట్లు సమాచారం.