తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సందీప్ చెప్పేది వేరు చేసేది వేరు' - యానిమల్​పై తాప్సీ కామెంట్స్ - Taapsee Pannu Animal Movie - TAAPSEE PANNU ANIMAL MOVIE

Taapsee Pannu Animal Movie : 'యానిమల్' సినిమాపై కాంట్రవర్సియల్ కామెంట్లు చేసింది బాలీవుడ్ బ్యూటీ తాప్సీ. ఆ చిత్ర డైరెక్టర్ సందీప్ రెడ్డి గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడింది. ఇంతకీ ఏమైందంటే?

Taapsee Pannu Animal Movie
Taapsee Pannu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 6:56 PM IST

Taapsee Pannu Animal Movie :ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్​ షేక్ చేసింది 'యానిమల్' మూవీ. అయితే రిలీజ్ అయిన నాటి నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. అందులో కామన్ ఆడియెన్స్​తో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ తాప్సీ కూడా 'యానిమల్'​పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ఈ సినిమా కోసం రాసిన స్క్రిప్ట్ చదివి ఉంటే తాను కూడా ఓకే చెప్పుంటానని, కానీ స్క్రిప్ట్‌లో మాత్రమే చెప్పినట్లు కాకుండా డైరక్టర్ ఈ సినిమాను మరోలా తీశారంటూ ఆమె కామెంట్​ చేసింది.

"ఈ సినిమా స్క్రిప్ట్ మాత్రమే చదివి ఉంటే నేను కూడా రణబీర్ కపూర్‌లా ఎగ్జైట్ అయ్యేదాన్ని. దీన్ని ఎలా తీస్తారనేది నాకు కూడా తెలియదు కదా. డైరక్టర్ ఈ మూవీని ఎలా తీయాలనుకుంటున్నారో అది స్క్రిప్ట్‌లో ఉండదు. అది కేవలం డైరక్టర్‌కి మాత్రమే తెలుసు. ఏ సన్నివేశాన్ని ఎలా తీస్తున్నారనేది, ఎప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువగా వస్తుందనేది డైరక్టర్ చేతుల్లోనే ఉంటుంది. కేవలం అతను మాత్రమే కెమెరా మెన్లతో గానీ, పోస్ట్ ప్రొడక్షన్ టీమ్‌తో గానీ కమ్యూనికేట్ అవుతుంటారు. షాట్ తీసిన విధానం బట్టే హీరోయిజం ఎలివేట్ అవుతుంది. అవన్నీ పేపర్ మీద ఉండవు. సినిమాలోని కొన్ని సీన్స్​కు విజిల్స్, అరుపులు విని నేను చాలా వింతగా ఫీలయ్యా. సడన్‌గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెరిగిపోవడం, ప్రేక్షకులు బలవంతంగా చప్పట్లు కొట్టడం, అభిమానులకు ఈలలు వేయాల్సి రావడం వంటివి గమనించాను" అంటూ తాప్సీ డైరెక్టర్ సందీప్​పై కామెంట్ చేసింది.

ఇక తాప్సీ ప్రస్తుతం 'ఖేల్ ఖేల్ మే' అనే ప్రాజెక్టులో నటిస్తోంది. అక్షయ్ కుమార్, వాణీ కపూర్, ఫర్దీన్ ఖాన్, అమ్మీ విర్క్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీటితో పాటు 'ఫిర్ ఆయి హసీన్ దిల్​రుబా', 'వో లడ్​కీ హై కహా' మూవీస్​లోనూ నటిస్తోంది. ఈ రెండూ కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.

అందుకే నాకు బాలీవుడ్ ఆఫర్స్​ వచ్చాయి : తాప్సీ

అందుకే సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నా - అసలు విషయం చెప్పిన తాప్సీ - Tapsee Pannu Marriage

ABOUT THE AUTHOR

...view details