తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కొన్ని విషయాల్లో మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం - అందుకే ఆయన అంటే ఇష్టం' - Taapsee Favourite Hero - TAAPSEE FAVOURITE HERO

Taapsee Favourite Hero : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ తాజాగా తన ఫేవరట్ హీరో పేరును రివీల్ చేసింది. ఇంతకీ ఆయన ఎవరంటే?

Taapsee Favourite Hero
Taapsee (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2024, 1:11 PM IST

Tapsee Favourite Hero :బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ తాజాగా తన ఫేవరట్​ హీరో పేరును రివీల్ చేసింది. 'డంకీ' సినిమాలో తనతో పాటు నటించిన హీరో షారుక్‌ ఖాన్‌కు ఆమె వీరాభిమానినంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పిన తాప్సీ, ఆయనతో కలిసి పనిచేసిన ఎక్స్​పీరియెన్స్​ను పంచుకుంది. అంతేకాకుండా ఆయనపై ప్రశంసల జల్లు కూడా కురిపించింది.

"ఆన్​ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్​స్క్రీన్​ కూడా షారుక్‌ చాలా ఫన్నీగా ఉంటారు. ఆయన మాట్లాడుతుంటే అలానే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంటుంది. ఏవిషయాన్నైనా సరే అంతే ఇంట్రెస్టింగ్​గా చెప్తుంటారు. ఎవరినైనా సరే ఆయన త్వరగానే అర్థం చేసుకోగలరు. కొన్ని విషయాల్లో మాత్రం మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయని పలు మార్లు అనిపించింది నాకు. కొందరికి డబ్బులు ఇచ్చి మమ్మల్ని మేము హైలైట్‌ చేసుకోవాలని అనుకోం. అలాంటి పొగడ్తలపై మాకు ఎటువంటి నమ్మకం ఉండదు. అలాగే షారుక్ కూడా తనను కామెంట్ చేసేవారికి సరైన పద్ధతిలో సమాధానం చెప్పగలరు. ఆయనతో కలిసి పనిచేసిన సమయంలో నేను ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాను. ఆయన ఎంతో తెలివైన వ్యక్తి" అంటూ షారుక్​ను పొగడ్తలతో ముంచెత్తింది తాప్సీ.

షారుక్​కు నాపై చాలా నమ్మకం
ఎన్నో రోజులుగా సరైన హిట్​ లేకుండా ఉన్న తాప్సీ 'డంకీ' సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. కానీ, ఈ సినిమా ఫలితంతో కాస్త నిరుత్సాహపడింది. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా 'డంకీ' సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తాప్సీ తెలిపింది. తన ఫేవరెట్ హీరో షారుక్​తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆమె చెప్పింది.

'షారుక్​ ఖాన్​తో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. డంకీ కోసం ఆయనతో రెండేళ్లు ప్రయాణం చేశాను. ఈ జర్నీలోనే ఆయన ఎన్నో పర్సనల్ విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. అంటే నాపై ఎంత నమ్మకం ఉంటే ఆయన వ్యక్తిగత విషయాలు నాకు చెప్తారు? ఆ నమ్మకాన్ని నేను ఎప్పటికీ నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ ఏ నటి రాదేమో' అని చెప్పింది.

సాత్విక్‌-చిరాగ్‌ ఓటమి - తాప్సీ భర్త షాకింగ్ డెసిషన్ - Paris Olympics 2024 Taapsee Husband

అందుకే నాకు బాలీవుడ్ ఆఫర్స్​ వచ్చాయి : తాప్సీ

ABOUT THE AUTHOR

...view details