Kanguva New Release Date : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కంగువా'. శివ దర్శకత్వం వహించారు. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ విడుదల కోసం అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అక్టోబర్ 10న రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం అఫీషియల్‌గా ప్రకటించింది. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనిపై సినీప్రియులు ఆనందం హర్షం చేస్తున్నారు.
వాస్తవానికి అక్టోబర్ 10న కంగువాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసి అనౌన్స్ చేశారు. అయితే అదే రోజున రజనీకాంత్ నటించిన వేట్టయాన్ రిలీజ్ కానున్నట్లు మరో అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో ఈ రెండు సినిమాల పోటీ తప్పదని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా సూర్య యూటర్న్ తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. సూర్య కూడా ఓ ఈవెంట్లో పరోక్షంగా సినిమా వాయిదా గురించి వ్యాఖ్యలు చేశారు.