Anaganaga Teaser : ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఈటీవీ విన్లో ఎప్పుడూ ఏదో ఒక మంచి కంటెంట్ సందడి చేస్తూనే ఉంటుంది. అటు వినోదాన్ని పంచుతూనే ఇటు ఆలోచింపజేసే సినిమాలు, సిరీస్‌లు ఇందులో చాలానే ఉన్నాయి. అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి ఓ కొత్త సినిమా యాడ్ అయ్యింది. అదే టాలీవుడ్ స్టార్ హీరో సుమంత్ కీలక పాత్రలో రూపొందిన 'అనగనగా'. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఉగాది కానుకగా ఓటీటీలోకి రానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ శనివారం ఆ గ్లింప్స్‌ను విడుదల చేసి టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. సన్నీ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సుమంత్ టీచర్‌గా కనిపించనున్నారు. నేటి విద్యా వ్యవస్థలోని పలు లోపాలను ఎత్తి చూపడమే కాకుండా, పిల్లలకు ఏ విధంగా పాఠాలు చెప్తే అర్థమవుతుందో చెప్పే ప్రయత్నాన్ని చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ చిత్రాన్ని 'ఈటీవీ విన్' అలాగే కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రానికి సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి.
జ్ఞాపకాలు గుర్తుచేస్తాయి :
అయితే అంతకంటే ముందు 'ఈటీవీ విన్'లో పలు సినిమాలు, సిరీస్‌లు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా కొన్నాళ్ల క్రితం విడుదలైన సినిమాలను అందించే ప్రయత్నం చేస్తోంది ఈ ప్లాట్‌ఫామ్. ఆ క్రమంలోనే 15 సినిమాలను తాజాగా ప్రేక్షకులకు అందుబాటులోకి ఉంచింది. అందులో 'ఎవడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'శ్రీరామదాసు', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'రామయ్యా వస్తావయ్యా', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' 'నాగవల్లి', 'మొగుడు', 'అదిరిందయ్యా చంద్రం', 'లవ్‌లీ', 'అదుర్స్, 'కేడీ', 'చింతకాయల రవి', 'స్టాలిన్', 'సోలో' సినిమాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.