SSMB 29 Shooting Update : సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'SSMB 29'. గత నెలలో ప్రారంభమైన సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయతే గత కొంత కాలంగా బ్రేక్‌లో ఉన్న మూవీ టీమ్ తాజాగా మళ్లీ సెట్లోకి అడుగుపెట్టింది. ఈ బ్రేక్‌లో హీరోయిన్ ప్రియాంక చోప్రా తన సోదరుడి వివాహానికి వెళ్లగా, ఆ వేడుకలు పూర్తి కాగానే మళ్లీ ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. ఇక మిగతా టీమ్ కూడా ఇప్పుడు నయా షెడ్యూల్ కోసం సెట్స్‌లోకి చేరుకుంది.
ప్రస్తుతం ఈ సినిమా కోసం తయారు చేసిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సమ్మర్ కల్లా విదేశాల్లోనూ షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది.
ఆ స్టార్ హీరోకు మొదటి సినిమా!
ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. పృథ్వీతో మూవీ టీమ్ చర్చలు కూడా జరిపిందని, ఆయన ఓకే కూడా చెప్పినట్టు కథనాలు వెలువడ్డాయి. అయితే పృథ్వీ ఇప్పుడు ఈ ప్రాజెక్టులో లేరని ప్రచారం సాగుతోంది. పృథ్వీరాజ్ స్థానంలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాంను తీసుకున్నట్లు సినీ వర్గాల టాక్. త్వరలోనే ఆయన షూటింగ్లో పాల్గొననున్నారని సమాచారం.