తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

స్టేజ్​పై భార్యతో కలిసి రాజమౌళి చిందులు - ఈ డ్యాన్స్ వీడియో చూశారా? - SS Rajamouli Dance - SS RAJAMOULI DANCE

SS Rajamouli Rama Dance Video : దర్శకధీరుడు రాజమౌళి తన భార్య రమాతో కలిసి ఓ స్టేజ్​పై చిందులేస్తూ ఆశ్చర్యపరిచారు. దాన్ని మీరు చూశారా?

స్టేజ్​పై భార్యతో కలిసి రాజమౌళి చిందులు - ఈ డ్యాన్స్ వీడియో చూశారా?
స్టేజ్​పై భార్యతో కలిసి రాజమౌళి చిందులు - ఈ డ్యాన్స్ వీడియో చూశారా?

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 10:04 AM IST

Updated : Apr 1, 2024, 1:46 PM IST

SS Rajamouli Rama Dance Video :దర్శకధీరుడు రాజ‌మౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి, RRRతో భారీ సక్సెస్​లను సాధించి గ్లోబల్​ వైడ్​గా ఫేమ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్​ బాబుతో కలిసి SSMB 29 ప్రీ ప్రొడక్షన్​ పనులతో బిజీగా ఉన్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టును గ్రాండ్​ లాంఛ్ చేయనున్నారు. అయితే ఈ మధ్య చాలా రోజులుగా SSMB 29 పనులతో బిజీగా ఉన్న ఆయన ప్రస్తుతం కాస్త బ్రేక్ తీసుకున్నారు. తన ఫ్యామిలీకి సంబంధించిన ఓ చిన్న ఈవెంట్​లో పాల్గొని సందడి చేశారు.

రాజమౌళి దంపతులు డ్యాన్స్​ - అయితే ఇప్పటివరకు జక్కన్న తెరకెక్కించిన బడా సినిమాలను మాత్రమే మనం చూశాం. అలాగే తన సినిమాలతో పాటు ఇతర చిత్రాల ఈవెంట్లలో స్టేజ్​పై మాట్లాడటం చూసి ఉంటాం. అయితే జక్కన్నలో మారో టాలెంట్ ఉందని చాలా మందికి ఇప్పుడే తెలిసింది. తాజాగా ఆయన పాల్గొన్న ఫ్యామిలీ ఫంక్షన్​లో స్టేజ్​పై చిందులేస్తూ ఆశ్చర్యపరిచారు. అది కూడా తన భార్య రమాతో కలిసి స్టెప్పులేస్తూ సందడి చేశారు. ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమ‌రాణి ఉత్త‌రాల‌కే పాటకు అదిరేలా చిందులేశారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో తెలుగు సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. వారంతా దాన్ని తెగ షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒకవేళ మీరు దీన్ని చూడకపోయి ఉంటే ఇక్కడ చూసేయండి.

పెళ్లి తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇలా -వాస్తవానికిజక్కన్న దంపతులు గతంలో కూడా ఓ సారి డ్యాన్స్ వేశారు. వారి కుమారుడు ఎస్. ఎస్ కార్తికేయ వివాహ వేడుకలో కలిసి చిందులేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఇలా కలిసి స్టెప్పులేసింది. కానీ రాజమౌళి మాత్రం ఈ మధ్యలో ఓ సారి డ్యాన్స్ వేశారు. RRR సినిమాకు ఆస్కార్ వచ్చిన సందర్భంలో దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి 'నాటు నాటు' హుక్ స్టెప్​ను రీ క్రియేట్ చేశారు. అది బాగా వైరల్ అయింది.

టిల్లన్న డామినేషన్​ - మూడు రోజుల్లోనే రూ.100కోట్ల దిశగా స్టార్ బాయ్ - DJ Tillu Square Day 3 Collections

ఈ వారమే విజయ్ ఫ్యామిలీ స్టార్, ​మంజుమ్మల్‌ బాయ్స్‌ - ఓటీటీలోకి మరో 15 సినిమాలు! - This Week Release Movies

Last Updated : Apr 1, 2024, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details