Sreeleela New Movie :ధమాకా విజయం తర్వాత శ్రీలీల వరుస సినిమాలతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. చాలా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన సినిమాలు దాదాపు ఐదారు రిలీజ్ అయ్యాయి. అయితే శ్రీలీలకు అనిల్ రావిపూడి- బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరిలో తప్ప మరే సినిమాలోనూ తగినంత గుర్తింపు రాలేదు. దీంతో శ్రీలీల సినిమాల్లో వేగం తగ్గించింది.
- లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల?
వరుస అపజయాల అనంతరం శ్రీలీల కెరీర్ పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్టు సెలక్షన్‌లో ఆచితూచి అడుగులు వేస్తోందని, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని సమాచారం. ఇదిలా ఉండగా శ్రీలీల ఓ లక్కీ ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ ప్రముఖ హీరో అజిత్ హీరోగా మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని రూపొందిస్తోంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీలో హీరోయిన్ ఛాన్స్ శ్రీలీలకు వచ్చిందని తెలుస్తోంది.
ఇప్పటికే మూవీ టీమ్ శ్రీలీలను కాంటాక్ట్ అయిందని, స్టోరీ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే కెరీర్‌లో బిగ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీలీలకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీని తర్వాత ఆమెకు కోలీవుడ్‌లో వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అజిత్ సరసన శ్రీలీల కనిపిస్తుందా? లేదా? చర్చలు ఎంత వరకు వచ్చాయి? అనే అంశంపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. స్టార్ హీరో అజిత్ జోడీగా నటిస్తే శ్రీలీల కెరీర్‌కి బిగ్ ప్లస్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.