Sonakshi Zaheer Iqbal Wedding : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సొనాక్షి సిన్హా పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను నేడు (జూన్ 23)న వివాహం చేసుకుంది. గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట బంధువులు, అతికొద్ది మంది సమక్షంలో తమ ఇంట్లోనే సింపుల్ వెడ్డింగ్ సెరిమనీలో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సొనాక్షి తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి. తమ పెళ్లి ఫొటోలను కూడా అభిమానుల కోసం అప్లోడ్ చేసింది. దానితో పాటు ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.
"ఏడేళ్ల క్రితం ఇదే రోజున కలిశాం. ఒకరినొకరం చూసుకున్నాం. అదే రోజున ఫిక్స్ అయ్యాం ఆ ప్రేమే మాకు దిక్సూచిలా మారింది. నడిపించింది కూడా. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాల కూడా మా ప్రేమే మాకు తోడుగా నిలిచింది. మా ఇరు కుటుంబాల ప్రేమ, ఆశీర్వాదాలతో ఇప్పుడు మేం ఒక్కటయ్యాం. ఇప్పుడు మేం భార్యా భర్తలం" అంటూ తమ పెళ్లి ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా, సొనాక్షి సిన్హా వెడ్డింగ్ శారీ కూడా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పెళ్లికి సొనాక్షి తన తల్లి పూనమ్ సిన్హా ఆమె వెడ్డింగ్‌కు ధరించిన చీర, నగలను వేసుకుంది. అలా సొనాక్షి తన తల్లిపైనున్న ప్రేమను చాటుకుంది. ఇక వరుడు జహీర్ కూడా సింపుల్ కుర్త టైప్ డ్రెస్‌నే వేసుకున్నాడు.