Sobhita Dhulipala Monkey Man :తెలుగుమ్మాయిలు టాలీవుడ్లో హీరోయిన్గా నిలదొక్కుకోవడమే కష్టం అనుకుంటున్న పరిస్థితి నుంచి టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా ఎన్నో మంచి పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది శోభిత. 2013లో దేశం తరపున మిస్ ఎర్త్ పోటీల్లో పాల్గొన్న శోభిత అందులో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత 2016లో రామన్ రాఘవ్ 2.0 సినిమాతో వెండితెరకు పరిచయం అయిన శోభిత తెలుగులో గూఢచారి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. నైట్ మేనేజర్ సిరీస్‌కు బెస్ట్ యాక్ట్రెస్ ఓటిటి అవార్డును కూడా సొంతం చేసుకుంది. గూఢచారి, మేడ్ ఇన్ హెవెన్, ఘోస్ట్ స్టోరీస్, నైట్ మేనేజర్, పోన్నియన్ సెల్వన్ వంటి సినిమా/సిరీస్‌లో ప్రధాన పాత్రలు చేసిన శోభిత ఇప్పుడు సరాసరి హాలీవుడ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే.
నటుడు దేవ్ పటేల్ (స్లమ్ డాగ్ మిలియనీర్) స్వీయ దర్శకత్వంలో వచ్చిన మంకి మ్యాన్ సినిమాలో ఒక వేశ్య పాత్రలో నటించింది శోభిత. ఈ సినిమా ఏప్రిల్ 5న అమెరికాలో విడుదలై అక్కడ పాజిటివ్ టాక్(Monkey Man Review) సొంతం చేసుకుంది. ఇండియాలో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం శోభిత అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో సీత అనే వేశ్య పాత్రలో నటించిన శోభిత - సినిమాలో తనది ప్రధాన పాత్ర అని, అలాంటి పాత్రలో నటించినందుకు గౌరవంగా అనిపించిందని చెప్పింది. ఈ సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయని దేవ్ పటేల్‌తో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన రామన్ రాఘవ్ 2.0 కన్నా ముందే ఈ మంకి మ్యాన్ సినిమాకు శోభిత ఆడిషన్ ఇచ్చినా ఈ సినిమా నిర్మాణానికి ఇంత సమయం పట్టింది. ఎట్టకేలకు ఈ మధ్యే హాలీవుడ్లో రిలీజైంది. ఇంకా ఈ చిత్రంలో దేవ్ పటేల్, శోభితతో పాటు సికందర్ ఖేర్, అదితి కల్ కుంటే, మకరంద్ దేశ్ పాండే కూడా నటించారు.
వేశ్యగా మారిన తెలుగు హీరోయిన్ - ఫుల్ హ్యాపీ అంటూ కామెంట్స్! - Sobhita Dhulipala Monkey Man - SOBHITA DHULIPALA MONKEY MAN
గూఢచారి, మెడ్ ఇన్ హెవెన్ లో విభిన్నమైన పాత్రలలో ప్రేక్షకులను మెప్పించిన శోభిత మంకి మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో వేశ్య పాత్రలో నటించడం గర్వంగా ఉందని తెలిపింది శోభిత.
Sobhita
Published : Apr 8, 2024, 12:56 PM IST